Emtaina maanamdu padi yemogaaga

ఎంతైన మానఁడు పతి యేమోకాక
Language

(॥పల్లవి॥)
ఎంతైన మానఁడు పతి యేమోకాక
ఇంతటఁ దానే పదరె నాడరాదు గాక

(॥ఎంతై॥)
వట్టినపయ్యదకొంగు పాయఁదియ్యఁ దడవా
చుట్టుపువరుస గొంత చూచితిఁగాక
తిట్టినట్టె నావిభునిఁ దిట్ట నాకుఁ దడవా
మెట్టిపట్టుక మిమ్మెల్ల మెప్పించితిఁ గాక

(॥ఎంతై॥)
వేడుక చెక్కునొక్కఁగ విదలించఁ దడవా
ఆఁడదానికేలంటా నటు వుంటిఁగాక
లేఁడు నామోవి యంటఁగ నే వొట్టువెట్టఁ దడవా
నాఁడు చేసినచేఁతకు నవ్వుకొంటిఁగాక

(॥ఎంతై॥)
గక్కనఁగాఁగిలించక కసరుకోఁ దడవా
వొక్కమోహములు చూచి వొప్పితిఁగాక
చిక్కితి వావిలిపాటి శ్రీ రఘునాధ నీ కీ-
యిక్కువ శ్రీ వేంకటాద్రి నిరవైతిఁగాక

(||pallavi||)
ĕṁtaina mānam̐ḍu padi yemogāga
iṁtaḍam̐ dāne padarĕ nāḍarādu gāga

(||ĕṁtai||)
vaṭṭinabayyadagŏṁgu pāyam̐diyyam̐ daḍavā
suṭṭubuvarusa gŏṁta sūsidim̐gāga
tiṭṭinaṭṭĕ nāvibhunim̐ diṭṭa nāgum̐ daḍavā
mĕṭṭibaṭṭuga mimmĕlla mĕppiṁchidim̐ gāga

(||ĕṁtai||)
veḍuga sĕkkunŏkkam̐ga vidaliṁcham̐ daḍavā
ām̐ḍadānigelaṁṭā naḍu vuṁṭim̐gāga
lem̐ḍu nāmovi yaṁṭam̐ga ne vŏṭṭuvĕṭṭam̐ daḍavā
nām̐ḍu sesinasem̐tagu navvugŏṁṭim̐gāga

(||ĕṁtai||)
gakkanam̐gām̐giliṁchaga kasarugom̐ daḍavā
vŏkkamohamulu sūsi vŏppidim̐gāga
sikkidi vāvilibāḍi śhrī raghunādha nī kī-
yikkuva śhrī veṁkaḍādri niravaidim̐gāga