Emtagu neravu neevu yemiseppedi

ఎంతకు నేరవు నీవు యేమిచెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంతకు నేరవు నీవు యేమిచెప్పేది
చెంతల నీ వేసాలకు సిగ్గయ్యీ నాకు

(॥ఎంత॥)
తెలమఱఁగున నాపె దిష్టము కత చెప్పఁగా
వరుస మాచెలి విని వచ్చెను నేఁడు
శిరసెత్తి నీమాటలే చెల్లఁబెట్టే వప్పటిని
అరుదయ్యీ నిన్నుఁ జూచి అంతలోనే నాకు

(॥ఎంత॥)
సంగడిఁ గూచుండి యాపె సరసములాడఁగాను
చెంగటఁ జూచివచ్చి చెప్పె మాసతి
అంగడిఁబడ్డవలపు అంతలోనే దాఁచేవు
వుంగిటి నీవోజకు నవ్వులు వచ్చీ నాకు

(॥ఎంత॥)
గక్కనఁ బాన్పుపై నాకె కాఁగిట నిన్నుఁగూడఁగా
ఇక్కువఁ దెలిసివచ్చె నిదె మాకాంత
వొక్కటై శ్రీవేంకటేశ వొగి నన్నుఁ గూడితివి
చొక్కి యలమేల్మంగను సాద్యమయ్యీ నాకు

(||pallavi||)
ĕṁtagu neravu nīvu yemisĕppedi
sĕṁtala nī vesālagu siggayyī nāgu

(||ĕṁta||)
tĕlamaṟam̐guna nābĕ diṣhṭamu kada sĕppam̐gā
varusa māsĕli vini vachchĕnu nem̐ḍu
śhirasĕtti nīmāḍale sĕllam̐bĕṭṭe vappaḍini
arudayyī ninnum̐ jūsi aṁtalone nāgu

(||ĕṁta||)
saṁgaḍim̐ gūsuṁḍi yābĕ sarasamulāḍam̐gānu
sĕṁgaḍam̐ jūsivachchi sĕppĕ māsadi
aṁgaḍim̐baḍḍavalabu aṁtalone dām̐sevu
vuṁgiḍi nīvojagu navvulu vachchī nāgu

(||ĕṁta||)
gakkanam̐ bānpubai nāgĕ kām̐giḍa ninnum̐gūḍam̐gā
ikkuvam̐ dĕlisivachchĕ nidĕ māgāṁta
vŏkkaḍai śhrīveṁkaḍeśha vŏgi nannum̐ gūḍidivi
sŏkki yalamelmaṁganu sādyamayyī nāgu