Emtagettugommanevu yemayya vogamaamte

ఎంతకెత్తుకొమ్మనేవు యేమయ్య వొకమాఁటే
Language

(॥పల్లవి॥)
ఎంతకెత్తుకొమ్మనేవు యేమయ్య వొకమాఁటే
వింతవింత వేడుకలు వెలసేదాననా

(॥ఎంత॥)
చాయలకు నీతోను సరిపెనఁగుమనేవు
ఆయములంటే పాటియంత దాననా
పాయపుమదాన నీపడిగెము పట్టేదాన
రాయడించి నిన్నింతరవ్వసేసేదా ననా

(॥ఎంత॥)
ననుపుననీతోనునవ్వులు నవ్వుమనేవు
మునుకొని మందెమేళములదాననా
యెనసిననీమోవియెంగిలి సోఁకినదాన
పనిగొని నిన్నింత పరచేటిదాననా

(॥ఎంత॥)
కందువఁ గూడుమనేవుకాఁగిటిలోనున్న దాన
అందరిలో పోరచియైనదాననా
విందుల శ్రీవేంకటేశ వేడుక నన్నే లితివి
అంది నీబూవపుదాన నడ్డమాడేదాన

(||pallavi||)
ĕṁtagĕttugŏmmanevu yemayya vŏgamām̐ṭe
viṁtaviṁta veḍugalu vĕlasedānanā

(||ĕṁta||)
sāyalagu nīdonu saribĕnam̐gumanevu
āyamulaṁṭe pāḍiyaṁta dānanā
pāyabumadāna nībaḍigĕmu paṭṭedāna
rāyaḍiṁchi ninniṁtaravvasesedā nanā

(||ĕṁta||)
nanubunanīdonunavvulu navvumanevu
munugŏni maṁdĕmeḽamuladānanā
yĕnasinanīmoviyĕṁgili som̐kinadāna
panigŏni ninniṁta paraseḍidānanā

(||ĕṁta||)
kaṁduvam̐ gūḍumanevugām̐giḍilonunna dāna
aṁdarilo porasiyainadānanā
viṁdula śhrīveṁkaḍeśha veḍuga nanne lidivi
aṁdi nībūvabudāna naḍḍamāḍedāna