Emtagemta sesevu yemayyaa

ఎంతకెంత సేసేవు యేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఎంతకెంత సేసేవు యేమయ్యా
కాంతఁ జూచి నీ మనసు గరఁగఁగ వలదా

(॥ఎంత॥)
చెనకినదై యాపె చేతులెత్తి మొక్కఎగాను
పెనఁగుచు చన్నులేల పిసికేవయ్యా
తనమీఁద నానవెట్టీ తడవకుమనుచును
వినవయ్య విన్నపము వేగిరించనేఁటికి

(॥ఎంత॥)
వొట్టువెట్టీనదె యాపె వూరడించి వేఁడుకోఁగా
తిట్టుచుఁ గొప్పేల పట్టితీ సేవయ్యా
అట్టె మోవి లంచమిచ్చేనని మన్నించుమనుచు
చుట్టరిక మెంచరాదా సూడువట్టనేఁటికి

(॥ఎంత॥)
కాలుదొక్కినదై యాపె కాఁగిలించుకొనఁగాను
యేల మరుకేలి నలఇంచేవయ్యా
ఆలరి శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
చాలమెచ్చి నవ్వరాదా జాగు సేయఁనేటికి

(||pallavi||)
ĕṁtagĕṁta sesevu yemayyā
kāṁtam̐ jūsi nī manasu garam̐gam̐ga valadā

(||ĕṁta||)
sĕnaginadai yābĕ sedulĕtti mŏkkægānu
pĕnam̐gusu sannulela pisigevayyā
tanamīm̐da nānavĕṭṭī taḍavagumanusunu
vinavayya vinnabamu vegiriṁchanem̐ṭigi

(||ĕṁta||)
vŏṭṭuvĕṭṭīnadĕ yābĕ vūraḍiṁchi vem̐ḍugom̐gā
tiṭṭusum̐ gŏppela paṭṭidī sevayyā
aṭṭĕ movi laṁchamichchenani manniṁchumanusu
suṭṭariga mĕṁcharādā sūḍuvaṭṭanem̐ṭigi

(||ĕṁta||)
kāludŏkkinadai yābĕ kām̐giliṁchugŏnam̐gānu
yela marugeli nala̮iṁchevayyā
ālari śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
sālamĕchchi navvarādā jāgu seyam̐neḍigi