Emtadi bidaari??? yeebe yeduvamti voyyaari

ఎంతటి బిటారి??? యీపె యెటువంటి వొయ్యారి
Language

(॥పల్లవి॥)
ఎంతటి బిటారి??? యీపె యెటువంటి వొయ్యారి
కాంతను సంతోసించి పొగడరమ్మ చెలులు

(॥ఎంత॥)
కొమ్మవురమున మించెఁ గుచగిరులు
తెమ్మలాయ నందుపై ముత్తెపుసరులు
కమ్ముకొనెఁ గొప్పలోనఁ గమ్మవిరులు
సొమ్ములతో విఱ్ఱవీఁగీఁ జూడరమ్మ చెలులు

(॥ఎంత॥)
దోమటి తట్టు పుణుఁగు తోడి చెక్కులు
కామించిన వలపుల కనుచొక్కులు
కోమలి మోవిఁ బలసోఁకుల పక్కులు
యీమేటి సింగారాలు యెంచరమ్మ చెలులు

(॥ఎంత॥)
కలికి కరముల చక్కని గోరులు
నిలువున మొలనూలి నీవి జారులు
యెరమి శ్రీవేంకటేశుఁ డీకెఁ గూడెను
మెలుఁత చందములెల్లా మెచ్చరమ్మ చెలులు

(||pallavi||)
ĕṁtaḍi biḍāri??? yībĕ yĕḍuvaṁṭi vŏyyāri
kāṁtanu saṁtosiṁchi pŏgaḍaramma sĕlulu

(||ĕṁta||)
kŏmmavuramuna miṁchĕm̐ gusagirulu
tĕmmalāya naṁdubai muttĕbusarulu
kammugŏnĕm̐ gŏppalonam̐ gammavirulu
sŏmmulado viṭravīm̐gīm̐ jūḍaramma sĕlulu

(||ĕṁta||)
domaḍi taṭṭu puṇum̐gu toḍi sĕkkulu
kāmiṁchina valabula kanusŏkkulu
komali movim̐ balasom̐kula pakkulu
yīmeḍi siṁgārālu yĕṁcharamma sĕlulu

(||ĕṁta||)
kaligi karamula sakkani gorulu
niluvuna mŏlanūli nīvi jārulu
yĕrami śhrīveṁkaḍeśhum̐ ḍīgĕm̐ gūḍĕnu
mĕlum̐ta saṁdamulĕllā mĕchcharamma sĕlulu