Emta yemmelam boraleveme neevu

ఎంత యెమ్మెలఁ బొరలేవేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత యెమ్మెలఁ బొరలేవేమే నీవు
మంతుకెక్క నిన్నాతఁడు మన్నించేనంటాను

(॥ఎంత॥)
కప్పురపుఁ బల్కు లెన్ని గాదెఁబోసేవే
కొప్పు చీఁకట్లెంతేసి కూడపెట్టేవే
ముప్పిరి నవ్వు లెందాఁకా మూటగట్టేవే
చొప్పు లెత్తి నిన్నాతెఁడు చూచీనంటాను

(॥ఎంత॥)
వేడుక సరసా లెన్ని వెదవెట్టేవే
తోడనే వలపు లెన్ని తూరుపెత్తేవే
మేడెపుఁజూపు లెంతేసి మేళవించేవే
జోడుగూడి నిన్నాతఁడు చూచీనంటాను

(॥ఎంత॥)
చక్కఁదనా లెన్నేసి పచారించేవే
పెక్కుతరితీపు లెన్ని పెరరేఁచేవే
యిక్కడ శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
చొక్కించి నన్నేల నిన్నుఁ జూచీనంటాను

(||pallavi||)
ĕṁta yĕmmĕlam̐ bŏraleveme nīvu
maṁtugĕkka ninnādam̐ḍu manniṁchenaṁṭānu

(||ĕṁta||)
kappurabum̐ balgu lĕnni gādĕm̐boseve
kŏppu sīm̐kaṭlĕṁtesi kūḍabĕṭṭeve
muppiri navvu lĕṁdām̐kā mūḍagaṭṭeve
sŏppu lĕtti ninnādĕm̐ḍu sūsīnaṁṭānu

(||ĕṁta||)
veḍuga sarasā lĕnni vĕdavĕṭṭeve
toḍane valabu lĕnni tūrubĕtteve
meḍĕbum̐jūbu lĕṁtesi meḽaviṁcheve
joḍugūḍi ninnādam̐ḍu sūsīnaṁṭānu

(||ĕṁta||)
sakkam̐danā lĕnnesi pasāriṁcheve
pĕkkudaridību lĕnni pĕrarem̐seve
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
sŏkkiṁchi nannela ninnum̐ jūsīnaṁṭānu