Emta yaamkarevu neevu imti seluvamu soosi

ఎంత యాఁకరేవు నీవు ఇంతి చెలువము చూచి
Language

(॥పల్లవి॥)
ఎంత యాఁకరేవు నీవు ఇంతి చెలువము చూచి
వింతలుగా జోడుగూడ విచారించేవా

(॥ఎంత॥)
గుత్తమైనగుబ్బలగురుతులు చూచేవు
చిత్తరువు వ్రాసేవా చెలిరూపము
హత్తి కలువరేకుల యళతులు గొలచేవు
కొత్తగాఁ గనుఁగోనలకొలఁది దెలిపేవా

(॥ఎంత॥)
పోడవైనయట్టికొప్పు పూఁచి కొలచుకొనేవు
అడియాలము చూచేవా అపెభావము
వెడఁద జంటపిఱుఁదు వేఁకము పడికట్టేవు
తొడరి యాసింగారము తూఁచుకొనేవా

(॥ఎంత॥)
చలపట్టి మోవితేనె చవులై యడిగేవు
అలమేల్ మంగబోగము లవి అయనా
యెలమి శ్రీవేంకటేశ యీపెఁ గాఁగిలించేవు
కలపుకోలుచుట్టరికము చూపేవా

(||pallavi||)
ĕṁta yām̐karevu nīvu iṁti sĕluvamu sūsi
viṁtalugā joḍugūḍa visāriṁchevā

(||ĕṁta||)
guttamainagubbalagurudulu sūsevu
sittaruvu vrāsevā sĕlirūbamu
hatti kaluvaregula yaḽadulu gŏlasevu
kŏttagām̐ ganum̐gonalagŏlam̐di dĕlibevā

(||ĕṁta||)
poḍavainayaṭṭigŏppu pūm̐si kŏlasugŏnevu
aḍiyālamu sūsevā abĕbhāvamu
vĕḍam̐da jaṁṭabiṟum̐du vem̐kamu paḍigaṭṭevu
tŏḍari yāsiṁgāramu tūm̐sugŏnevā

(||ĕṁta||)
salabaṭṭi movidenĕ savulai yaḍigevu
alamel maṁgabogamu lavi ayanā
yĕlami śhrīveṁkaḍeśha yībĕm̐ gām̐giliṁchevu
kalabugolusuṭṭarigamu sūbevā