Emta yaagaree neegu yee taruni

ఎంత యాకరీ నీకు యీ తరుణి
Language

(॥పల్లవి॥)
ఎంత యాకరీ నీకు యీ తరుణి
పొంతనే వేడుక లెంత పొదిగీనో కాని

(॥ఎంత॥)
చెక్కులఁ జెమటగార సేసీ నీకు నూడిగాలు
యెక్కు డైనబత్తితో నీ యింతి
లక్కవలెఁ గరఁగుతా లలిరేఁగి నవ్వీని
వుక్కుమీరి వలపెంత వున్నదో కాని

(॥ఎంత॥)
మచ్చికలు చూపి చూపి మాఁటలెల్లా నాడీని
యిచ్చకము సేసుకొంటా యాయింతి
కొచ్చి కొచ్చి సారె సారెఁ గొలువులు సేసీని
పచ్చిదేరేయాస లెంత ప్రబలీనోకాని

(॥ఎంత॥)
కదిసి యేపొద్దు నీచక్కని మొగమే చూచి
యెదుటనే నిలుచుండీ యాయింతి
మొదల నన్నేలితివిముప్పిరి శ్రీవేంకటేశ
పొదిగీ నిన్ను పొందెంత పొదలీనో కాని

(||pallavi||)
ĕṁta yāgarī nīgu yī taruṇi
pŏṁtane veḍuga lĕṁta pŏdigīno kāni

(||ĕṁta||)
sĕkkulam̐ jĕmaḍagāra sesī nīgu nūḍigālu
yĕkku ḍainabattido nī yiṁti
lakkavalĕm̐ garam̐gudā lalirem̐gi navvīni
vukkumīri valabĕṁta vunnado kāni

(||ĕṁta||)
machchigalu sūbi sūbi mām̐ṭalĕllā nāḍīni
yichchagamu sesugŏṁṭā yāyiṁti
kŏchchi kŏchchi sārĕ sārĕm̐ gŏluvulu sesīni
pachchidereyāsa lĕṁta prabalīnogāni

(||ĕṁta||)
kadisi yebŏddu nīsakkani mŏgame sūsi
yĕduḍane nilusuṁḍī yāyiṁti
mŏdala nannelidivimuppiri śhrīveṁkaḍeśha
pŏdigī ninnu pŏṁdĕṁta pŏdalīno kāni