Emta vorubo needi yemi seppedi

ఎంత వోరుపో నీది యేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత వోరుపో నీది యేమి చెప్పేది
పంతాన జంకించితేను పచ్చినవ్వు ముంచెను

(॥ఎంత॥)
చండిపెట్టి మాఁటలాడి సతి నిన్ను దూరఁగాను
నిండుకొనెఁ బులకలు నీ మేనను
కొండలవంటి చన్నుగుబ్బలు నిన్నొత్తగాను
అండనే నీమనసెల్లా నప్పుడే కరఁగెను

(॥ఎంత॥)
మునుకొని బలిమి నీ మోవి పిప్పి సేసితేను
తనివోని చెమటలు దైవారెను
పెనఁగి కరములను బిగ్గెఁ గాఁగిలించఁగాను
చెనకుల వలపులు చిమ్మిరేఁగె మీకును

(॥ఎంత॥)
కడలేని రతులను కదిమి నిన్నుఁ గూడఁగా
జడిగొని సంతోసాలు జాజుకొనెను
అడరి శ్రీవేంకటేశ అంగన నిన్నుఁ గూడితే
కడు నీమోమునఁ జంద్ర కళలెల్లాఁ దేరెను

(||pallavi||)
ĕṁta vorubo nīdi yemi sĕppedi
paṁtāna jaṁkiṁchidenu pachchinavvu muṁchĕnu

(||ĕṁta||)
saṁḍibĕṭṭi mām̐ṭalāḍi sadi ninnu dūram̐gānu
niṁḍugŏnĕm̐ bulagalu nī menanu
kŏṁḍalavaṁṭi sannugubbalu ninnŏttagānu
aṁḍane nīmanasĕllā nappuḍe karam̐gĕnu

(||ĕṁta||)
munugŏni balimi nī movi pippi sesidenu
tanivoni sĕmaḍalu daivārĕnu
pĕnam̐gi karamulanu biggĕm̐ gām̐giliṁcham̐gānu
sĕnagula valabulu simmirem̐gĕ mīgunu

(||ĕṁta||)
kaḍaleni radulanu kadimi ninnum̐ gūḍam̐gā
jaḍigŏni saṁtosālu jājugŏnĕnu
aḍari śhrīveṁkaḍeśha aṁgana ninnum̐ gūḍide
kaḍu nīmomunam̐ jaṁdra kaḽalĕllām̐ derĕnu