(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యేమోయి
దొంతివేసాలిట్టె వెన్నెతోడఁ బెట్టరా
(॥ఎంత॥)
చెక్కులు నొక్కితేనే చివుకనఁ గసరేవు
మొక్కితేనే బూతులను ముంచి తిట్టేవు
పక్కున నవ్వఁగానే పైకొని పంతమాడేవు
మొక్కళము వెన్నతోఁ బాముచుఁ బెట్టిరా
(॥ఎంత॥)
మొగము చూచితేనే మొనగోరఁ జెనకేవు
యెగసక్కేలాడితేనే యెమ్మెచూపేవు
పగటునఁ బెనఁగితే పట్టి సాములు సేసేవు
బిగువులు తోడంటి పేరఁబెట్టిరా
(॥ఎంత॥)
కదిసి పైకొంటేనే కరంగి లోనయ్యేవు
పొదిగితేఁ గాఁగిలించి భోగించేవు
యిదిగో శ్రీవేంకటేశ యింతాఁ గలయఁగొనేవు
మదములనన్నియును వుమ్మడిఁ బెట్టిరా
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yemoyi
dŏṁtivesāliṭṭĕ vĕnnĕdoḍam̐ bĕṭṭarā
(||ĕṁta||)
sĕkkulu nŏkkidene sivuganam̐ gasarevu
mŏkkidene būdulanu muṁchi tiṭṭevu
pakkuna navvam̐gāne paigŏni paṁtamāḍevu
mŏkkaḽamu vĕnnadom̐ bāmusum̐ bĕṭṭirā
(||ĕṁta||)
mŏgamu sūsidene mŏnagoram̐ jĕnagevu
yĕgasakkelāḍidene yĕmmĕsūbevu
pagaḍunam̐ bĕnam̐gide paṭṭi sāmulu sesevu
biguvulu toḍaṁṭi peram̐bĕṭṭirā
(||ĕṁta||)
kadisi paigŏṁṭene karaṁgi lonayyevu
pŏdigidem̐ gām̐giliṁchi bhogiṁchevu
yidigo śhrīveṁkaḍeśha yiṁtām̐ galayam̐gŏnevu
madamulananniyunu vummaḍim̐ bĕṭṭirā