ఎంత వేగిరకాఁడవు యేమందు నిన్ను
(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యేమందు నిన్ను
సంతతపు వలపులు చల్లు వెదలాయను
(॥ఎంత॥)
సిగ్గువడకుండరాదా చింతలెల్లఁ బాపేఁగాని
యెగ్గు లెంచకుండరాదా యెనసేఁగాని
తగ్గక నీవును నేను తతిగొని మొక్కఁగాను
వెగ్గళించి చెమటలు వెల్లావిరులాయను
(॥ఎంత॥)
చెఱఁగు విడువరాదా చెప్పినట్లు సేసేఁగాని
మఱఁగుకు రారాదా మాటాడేఁగాని
గుఱిగాఁగ నిద్దరము కూరిములు గొసరఁగా
కఱకుఁబ్రల్లదములు కడుఁబెంటలాయను
(॥ఎంత॥)
వీడె మందుకోరాదా వేడుకలు సేసేఁగాని
చూడరాదా నాదిక్కు చొక్కించేఁగాని
యీడుగ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కూడితివి వెరగులు కోటానఁగోటా(ట్లా?) యను
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yemaṁdu ninnu
saṁtadabu valabulu sallu vĕdalāyanu
(||ĕṁta||)
sigguvaḍaguṁḍarādā siṁtalĕllam̐ bābem̐gāni
yĕggu lĕṁchaguṁḍarādā yĕnasem̐gāni
taggaga nīvunu nenu tadigŏni mŏkkam̐gānu
vĕggaḽiṁchi sĕmaḍalu vĕllāvirulāyanu
(||ĕṁta||)
sĕṟam̐gu viḍuvarādā sĕppinaṭlu sesem̐gāni
maṟam̐gugu rārādā māḍāḍem̐gāni
guṟigām̐ga niddaramu kūrimulu gŏsaram̐gā
kaṟagum̐bralladamulu kaḍum̐bĕṁṭalāyanu
(||ĕṁta||)
vīḍĕ maṁdugorādā veḍugalu sesem̐gāni
sūḍarādā nādikku sŏkkiṁchem̐gāni
yīḍuga śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kūḍidivi vĕragulu koḍānam̐goḍā(ṭlā?) yanu