ఎంత వేగిరకాఁడ వేమయ్య నీవు
(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడ వేమయ్య నీవు
చెంత నూరకుండఁగానే సేసలు చల్లేవు
(॥ఎంత॥)
సెలవి నవ్వులతోడ సిగ్గువడి వుండఁగానే
బలిమి నాపెచన్నులు పట్టితీసేవు
నిలువుఁదమకమున నివ్వెర గందఁగానే
కొలఁదిమీరఁగను గక్కునఁ జెనకేవు
(॥ఎంత॥)
తగు నీపై తలపోఁత తలఁచుకుండఁగానే
చిగురుఁబెదవి యాని చిమ్మి రేఁచేవు
మొగము చూచి నీపై మోహములు నెరపఁగా
బిగువుఁగాఁగిట నొత్తి పిప్పిసేసేవు
(॥ఎంత॥)
ముద్దులు గునిపి నీతో ముచ్చటలడఁగానే
అద్దుకొని రతికేలి నలయించేవు
గద్దించి శ్రీవేంకటేశ కన్నుల మొక్కఁగానే
పెదరికానకు సారెఁ బెనఁగులాడేవు
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍa vemayya nīvu
sĕṁta nūraguṁḍam̐gāne sesalu sallevu
(||ĕṁta||)
sĕlavi navvuladoḍa sigguvaḍi vuṁḍam̐gāne
balimi nābĕsannulu paṭṭidīsevu
niluvum̐damagamuna nivvĕra gaṁdam̐gāne
kŏlam̐dimīram̐ganu gakkunam̐ jĕnagevu
(||ĕṁta||)
tagu nībai talabom̐ta talam̐suguṁḍam̐gāne
sigurum̐bĕdavi yāni simmi rem̐sevu
mŏgamu sūsi nībai mohamulu nĕrabam̐gā
biguvum̐gām̐giḍa nŏtti pippisesevu
(||ĕṁta||)
muddulu gunibi nīdo muchchaḍalaḍam̐gāne
addugŏni radigeli nalayiṁchevu
gaddiṁchi śhrīveṁkaḍeśha kannula mŏkkam̐gāne
pĕdarigānagu sārĕm̐ bĕnam̐gulāḍevu