ఎంత వేడుకో కాని యింతి నీపైని
(॥పల్లవి॥)
ఎంత వేడుకో కాని యింతి నీపైని
కాంత నేలుదు రావయ్య కాచుకున్నది
(॥ఎంత॥)
చెలియకు నీసుద్దులు చెప్పినంతలోననే
చెలపచెమట లవే చెక్కులనిఁడె
అలరి నీవుంగరము అట్టె పొడగంటానే
మొలకనవ్వులు నిండె మోవిమీఁదను
(॥ఎంత॥)
నీచెలనని ముందట నిలుచున్నయపుడే
లాచి మోముననెల్లాఁ గళలు దేరెను
చూచి నీకానవాలునేఁ జూపేనని యడిగితే
కాచుక మైఁబులకలు కమ్ముకొని మించెను
(॥ఎంత॥)
నీరాక యెఱిఁగి యిట్టె నేఁ దలుపుదెరచితే
చేరి నీ కెదురువచ్చి సిగ్గువడెను
యీరీతి శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
తారుకాణ వచ్చితేను తగ నన్ను మెచ్చెను
(||pallavi||)
ĕṁta veḍugo kāni yiṁti nībaini
kāṁta neludu rāvayya kāsugunnadi
(||ĕṁta||)
sĕliyagu nīsuddulu sĕppinaṁtalonane
sĕlabasĕmaḍa lave sĕkkulanim̐ḍĕ
alari nīvuṁgaramu aṭṭĕ pŏḍagaṁṭāne
mŏlaganavvulu niṁḍĕ movimīm̐danu
(||ĕṁta||)
nīsĕlanani muṁdaḍa nilusunnayabuḍe
lāsi momunanĕllām̐ gaḽalu derĕnu
sūsi nīgānavālunem̐ jūbenani yaḍigide
kāsuga maim̐bulagalu kammugŏni miṁchĕnu
(||ĕṁta||)
nīrāga yĕṟim̐gi yiṭṭĕ nem̐ dalubudĕraside
seri nī kĕduruvachchi sigguvaḍĕnu
yīrīdi śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
tārugāṇa vachchidenu taga nannu mĕchchĕnu