Emta vedugagaamde yidivo taanu

ఎంత వేడుకకాఁడే యిదివో తాను
Language

(॥పల్లవి॥)
ఎంత వేడుకకాఁడే యిదివో తాను
చెంత నిందరూఁ జూడఁగా జెనకీ నన్ను

(॥ఎంత॥)
వూరఁగల వలపెల్లా నొడిఁగట్టుకొనివచ్చి
నారుకొన నాతో నేమి నవ్వు నవ్వీనే
తేరకాఁడు మోవితేనె లారగించి యన్నువట్టి
పారితెంచి వద్ద నేమి పవ్వళించీనే

(॥ఎంత॥)
తరుణుల వావు లెల్లా తలమోచుక యలసి
పొరుగుకు వచ్చి దప్పిఁ బొరలనేలే
వొరసి చనుఁగొండల వొత్తున మేను కుమ్మెలై
యిరవై మా యింట గస్తూరేమి మెత్తుకొనీనే

(॥ఎంత॥)
నెట్టుకొన్న రతులెల్లా నేరుచుక చెలరేఁగి
గుట్టుతో నాపై నెంత గుదిగుచ్చీనే
యిట్టె శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁ గూడె
చుట్టి తనచేఁత లిందుఁ జూపనేల వచ్చీనే

(||pallavi||)
ĕṁta veḍugagām̐ḍe yidivo tānu
sĕṁta niṁdarūm̐ jūḍam̐gā jĕnagī nannu

(||ĕṁta||)
vūram̐gala valabĕllā nŏḍim̐gaṭṭugŏnivachchi
nārugŏna nādo nemi navvu navvīne
teragām̐ḍu movidenĕ lāragiṁchi yannuvaṭṭi
pāridĕṁchi vadda nemi pavvaḽiṁchīne

(||ĕṁta||)
taruṇula vāvu lĕllā talamosuga yalasi
pŏrugugu vachchi dappim̐ bŏralanele
vŏrasi sanum̐gŏṁḍala vŏttuna menu kummĕlai
yiravai mā yiṁṭa gastūremi mĕttugŏnīne

(||ĕṁta||)
nĕṭṭugŏnna radulĕllā nerusuga sĕlarem̐gi
guṭṭudo nābai nĕṁta gudiguchchīne
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannum̐ gūḍĕ
suṭṭi tanasem̐ta liṁdum̐ jūbanela vachchīne