Emta tamagabadevu yimtalo neevu

ఎంత తమకపడేవు యింతలో నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత తమకపడేవు యింతలో నీవు
వింతగాఁ జెనకి తెరవేయఁగవలెనా

(॥ఎంత॥)
బలిమేల సేసేవు పయ్యదేల ముట్టేవు
అలరి మాట గలితే నానతీరాదా
పిలువఁగా వస్తి నింతే పెనఁగినదానఁ గాను
కలయ లోనికిఁ దీసి గడెవెట్టవలెనా

(॥ఎంత॥)
సన్నలేల సేసేవు సారెనేల నమ్మించేవు
చెన్నుగా వలసినట్టు సేయఁగరాదా
మననించఁగా నవ్వే నింతే మట్టుమీరేదానఁ గాను
మిన్నక నావొడి వట్టి మేడ యెక్కవలెనా

(॥ఎంత॥)
గోరనేల దూరేవు కొప్పేల దువ్వేవు
కూరిమిఁ బెండ్లాడితివి కూడఁగరాదా
యీరీతి శ్రీవేంకటేశ యెడసేటిదానఁ గాను
చేరి పచ్చడము గప్పి చెక్కు నొక్కవలెనా

(||pallavi||)
ĕṁta tamagabaḍevu yiṁtalo nīvu
viṁtagām̐ jĕnagi tĕraveyam̐gavalĕnā

(||ĕṁta||)
balimela sesevu payyadela muṭṭevu
alari māḍa galide nānadīrādā
piluvam̐gā vasti niṁte pĕnam̐ginadānam̐ gānu
kalaya lonigim̐ dīsi gaḍĕvĕṭṭavalĕnā

(||ĕṁta||)
sannalela sesevu sārĕnela nammiṁchevu
sĕnnugā valasinaṭṭu seyam̐garādā
mananiṁcham̐gā navve niṁte maṭṭumīredānam̐ gānu
minnaga nāvŏḍi vaṭṭi meḍa yĕkkavalĕnā

(||ĕṁta||)
goranela dūrevu kŏppela duvvevu
kūrimim̐ bĕṁḍlāḍidivi kūḍam̐garādā
yīrīdi śhrīveṁkaḍeśha yĕḍaseḍidānam̐ gānu
seri pachchaḍamu gappi sĕkku nŏkkavalĕnā