ఎంత సులబమో నీవు యీకె యింత సేయవచ్చె
(॥పల్లవి॥)
ఎంత సులబమో నీవు యీకె యింత సేయవచ్చె
చెంతఁ దన యగ్గలిక చిత్తగించవయ్యా
(॥ఎంత॥)
కలికి నీ మనసెల్లాఁ గరఁగ మాఁటాడవచ్చె
సొలసి సొలసి నిన్నుఁ జూడవచ్చెను
వలపు నీపైఁ జల్లి వాడిక సేసుకోవచ్చె
పిలిచి యాపెను వద్దఁ బెట్టుకొనవయ్యా
(॥ఎంత॥)
తడవి చుట్టరికము దలఁపించఁగ వచ్చె
వొడివట్టి నినుఁ గడు నుబ్బించ వచ్చె
కడు వినయాలు సేసి కాఁగిలడుగఁగ వచ్చె
యెడయ కాపె నీడనే యెదురుకోవయ్యా
(॥ఎంత॥)
ఆయములు ముట్ట నీకు నాసలు రేఁచఁగ వచ్చె
కాయజకేలి నిన్నుఁ గలయ వచ్చె
యీయెడ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
పాయక న న్నేలితివి భామనుఁ గూడవయ్యా
(||pallavi||)
ĕṁta sulabamo nīvu yīgĕ yiṁta seyavachchĕ
sĕṁtam̐ dana yaggaliga sittagiṁchavayyā
(||ĕṁta||)
kaligi nī manasĕllām̐ garam̐ga mām̐ṭāḍavachchĕ
sŏlasi sŏlasi ninnum̐ jūḍavachchĕnu
valabu nībaim̐ jalli vāḍiga sesugovachchĕ
pilisi yābĕnu vaddam̐ bĕṭṭugŏnavayyā
(||ĕṁta||)
taḍavi suṭṭarigamu dalam̐piṁcham̐ga vachchĕ
vŏḍivaṭṭi ninum̐ gaḍu nubbiṁcha vachchĕ
kaḍu vinayālu sesi kām̐gilaḍugam̐ga vachchĕ
yĕḍaya kābĕ nīḍane yĕdurugovayyā
(||ĕṁta||)
āyamulu muṭṭa nīgu nāsalu rem̐sam̐ga vachchĕ
kāyajageli ninnum̐ galaya vachchĕ
yīyĕḍa śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
pāyaga na nnelidivi bhāmanum̐ gūḍavayyā