Emta soosidire nannu yemire meeru

ఎంత సూసితిరే నన్ను యేమిరే మీరు
Language

(॥పల్లవి॥)
ఎంత సూసితిరే నన్ను యేమిరే మీరు
రంతుల వాని నీడకు రప్పించలేనా

(॥ఎంత॥)
అంగనలమోము చూచి అతఁడిట్టె నవ్వఁగాను
యెంగిలినవ్వు నేనూ నవ్వేదా
అంగడిజాణతనాలు అందరతో నాడఁగాను
జంగిలిసరసములు సారె నేనూ నాడేదా

(॥ఎంత॥)
మచ్చికనందరితోను మాట లాతఁ డాడఁగాను
ఇచ్చట మూఁకమాటలు ఇప్పు డాడేదా
వచ్చివచ్చి అందరిపై వలపులు చల్లఁగాను
కచ్చుపెట్టి నావలపుఁ గలయవేసేదా

(॥ఎంత॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చెలులఁ బిలువఁగాను
వోవరిలోనే నుండి వూఁకొనేదా
వావు లందరిపై వేసి వడిఁదానే నన్నుఁగూడె
యీవలవలమేల్మంగ నెరవులు సేతువా

(||pallavi||)
ĕṁta sūsidire nannu yemire mīru
raṁtula vāni nīḍagu rappiṁchalenā

(||ĕṁta||)
aṁganalamomu sūsi adam̐ḍiṭṭĕ navvam̐gānu
yĕṁgilinavvu nenū navvedā
aṁgaḍijāṇadanālu aṁdarado nāḍam̐gānu
jaṁgilisarasamulu sārĕ nenū nāḍedā

(||ĕṁta||)
machchiganaṁdaridonu māḍa lādam̐ ḍāḍam̐gānu
ichchaḍa mūm̐kamāḍalu ippu ḍāḍedā
vachchivachchi aṁdaribai valabulu sallam̐gānu
kachchubĕṭṭi nāvalabum̐ galayavesedā

(||ĕṁta||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu sĕlulam̐ biluvam̐gānu
vovarilone nuṁḍi vūm̐kŏnedā
vāvu laṁdaribai vesi vaḍim̐dāne nannum̐gūḍĕ
yīvalavalamelmaṁga nĕravulu seduvā