Emta sittino yidi neeyida veduvamtido

ఎంత చిత్తిణో యిది నీయిత వెటువంటిదో
Language

(॥పల్లవి॥)
ఎంత చిత్తిణో యిది నీయిత వెటువంటిదో
చెంతనున్న చెలులెల్లా శిరసులు వంచేరు

(॥ఎంత॥)
చిన్నచేతుల నీకొప్పు చెలరేఁగి దువ్వుతాను
చన్నుల నిన్ను నొత్తీ జవరాలు
పన్నుక నీవద్దనుండి పాదాలు గుద్దుతాను
సన్నలనే పొందొడల సాముసేసీని

(॥ఎంత॥)
యేపొద్దు చూచిన నీతో యేకతాలాడుతాను
రాపుగ నీబుజము లోరసుకొనీని
తీపుతనీమాటలకు తేరకొన నిన్నుఁ జూచి
ఆఁపరాక మెచ్చిమెచ్చి అలముకొనీని

(॥ఎంత॥)
చెలరేఁగి నీమెనల్లా సింగారించుకొంటా
సోలసి మర్మము లిటె సోఁకించీని
అలమేలుమంగపతివైనశ్రీవేంకటేశ్వర
యెలమి నన్నేలఁగాఁ దా నచ్చీని విడెము

(||pallavi||)
ĕṁta sittiṇo yidi nīyida vĕḍuvaṁṭido
sĕṁtanunna sĕlulĕllā śhirasulu vaṁcheru

(||ĕṁta||)
sinnasedula nīgŏppu sĕlarem̐gi duvvudānu
sannula ninnu nŏttī javarālu
pannuga nīvaddanuṁḍi pādālu guddudānu
sannalane pŏṁdŏḍala sāmusesīni

(||ĕṁta||)
yebŏddu sūsina nīdo yegadālāḍudānu
rābuga nībujamu lorasugŏnīni
tībudanīmāḍalagu teragŏna ninnum̐ jūsi
ām̐parāga mĕchchimĕchchi alamugŏnīni

(||ĕṁta||)
sĕlarem̐gi nīmĕnallā siṁgāriṁchugŏṁṭā
solasi marmamu liḍĕ som̐kiṁchīni
alamelumaṁgabadivainaśhrīveṁkaḍeśhvara
yĕlami nannelam̐gām̐ dā nachchīni viḍĕmu