ఎంత సేసేవు నాతోను యెరవులదాననా
(॥పల్లవి॥)
ఎంత సేసేవు నాతోను యెరవులదాననా
వింతలుగాఁ జూచేనా వేడుక నీ పొందులు
(॥ఎంత॥)
కమ్మరఁగమ్మర నాతోఁ గడు బాసలు సే సేవు
నమ్మనా తొల్లి నిన్ను నాటకీఁడా
కుమ్మరించేవు వలపు గొనకొన్న ప్రియముల
సమ్మతించనా నేను సరి నీ యానతికి
(॥ఎంత॥)
అందు నిందు నిచ్చకము లట్టె యేల చూపేవు
పొంది నిన్నుఁ గోపించేనా బూటకీఁడ
చిందేవు వినయాలు చెక్కుల నొక్కులనే
నిందవేసేనా నీపై నీ మొగము చూచి
(॥ఎంత॥)
లలిఁదేనెగారే మోవి లంచమేల చూపేవు
కలయక మానేనా కాతరీఁడ
యెలమి శ్రీ వేంకటేశ యిద్దరముఁ గూడితిమి
అల సేనా నే నిఁక అట్టె నీ రతులను
(||pallavi||)
ĕṁta sesevu nādonu yĕravuladānanā
viṁtalugām̐ jūsenā veḍuga nī pŏṁdulu
(||ĕṁta||)
kammaram̐gammara nādom̐ gaḍu bāsalu se sevu
nammanā tŏlli ninnu nāḍagīm̐ḍā
kummariṁchevu valabu gŏnagŏnna priyamula
sammadiṁchanā nenu sari nī yānadigi
(||ĕṁta||)
aṁdu niṁdu nichchagamu laṭṭĕ yela sūbevu
pŏṁdi ninnum̐ gobiṁchenā būḍagīm̐ḍa
siṁdevu vinayālu sĕkkula nŏkkulane
niṁdavesenā nībai nī mŏgamu sūsi
(||ĕṁta||)
lalim̐denĕgāre movi laṁchamela sūbevu
kalayaga mānenā kādarīm̐ḍa
yĕlami śhrī veṁkaḍeśha yiddaramum̐ gūḍidimi
ala senā ne nim̐ka aṭṭĕ nī radulanu