Emta sesem joodare imti javvana paayamu

ఎంత సేసెఁ జూడరే ఇంతి జవ్వన పాయము
Language

(॥పల్లవి॥)
ఎంత సేసెఁ జూడరే ఇంతి జవ్వన పాయము
అంతలోనె వేడుకలూ నట్టె యొనగూడెను

(॥ఎంత॥)
తెగనియాసోదము తీగెలు సాగిసాగి
సొగసి వలపులై చుట్టుకొనెను
తగులు విరులైనట్టి తమకము లుప్పతిలి
మొగము చూడఁగానే ముంచుకొనెఁ బ్రేమము

(॥ఎంత॥)
వులివచ్చి తలపోఁత లుమ్మగిలి వుమ్మగిలి
చెలికిఁ జుట్టరికమై చిగిరించెను
చలిమి బలిమితోడి సరసము లుక్కుమీరి
నిలువుకు నిలువే నిండె నివ్వెరగులు

(॥ఎంత॥)
చేవ మీరిన సిగ్గులు చిమ్మిరేఁగి చిమ్మిరేఁగి
వేవేలు మంతనములై వెల్లివిరిసె
శ్రీ వేంకటేశ్వరుని చిత్తజకేలి రతులు
యీవేళ నలమేల్మంగ కిరవాయఁ గళలు

(||pallavi||)
ĕṁta sesĕm̐ jūḍare iṁti javvana pāyamu
aṁtalonĕ veḍugalū naṭṭĕ yŏnagūḍĕnu

(||ĕṁta||)
tĕganiyāsodamu tīgĕlu sāgisāgi
sŏgasi valabulai suṭṭugŏnĕnu
tagulu virulainaṭṭi tamagamu luppadili
mŏgamu sūḍam̐gāne muṁchugŏnĕm̐ bremamu

(||ĕṁta||)
vulivachchi talabom̐ta lummagili vummagili
sĕligim̐ juṭṭarigamai sigiriṁchĕnu
salimi balimidoḍi sarasamu lukkumīri
niluvugu niluve niṁḍĕ nivvĕragulu

(||ĕṁta||)
seva mīrina siggulu simmirem̐gi simmirem̐gi
vevelu maṁtanamulai vĕllivirisĕ
śhrī veṁkaḍeśhvaruni sittajageli radulu
yīveḽa nalamelmaṁga kiravāyam̐ gaḽalu