ఎంత సేసే వేమోయి యెఱఁగరా ఇందరును
(॥పల్లవి॥)
ఎంత సేసే వేమోయి యెఱఁగరా ఇందరును
చింతకాయకజ్జాయమై చిప్పిలీఁ దమకము
(॥ఎంత॥)
పలికి యెవ్వరినైన భ్రమఇంచనేరవా
వెలఁదుల నమ్మించ నీవిద్యగాదా
పలుమారు మాతోనేల బాసలు వేయవచ్చేవు
సెలవినవ్వులలోనే చేఁగలెక్కీ నిజము
(॥ఎంత॥)
చేయిచ్చి వాడవారిని చిక్కించుకోనోపవా
చాయలు సేసుక మెచ్చ జాణవుగావా
కాయకపునననుపేల కలయఁగఁబెట్టేవు
తోయరానివావులనే దొడ్డిఁ జిక్కెవలపు
(॥ఎంత॥)
సేసవెట్టి ఇంతులనుఁ జేరి పెండ్లాడఁ గొంకేవా
వాసులు రేఁచఁగ దేవరవు గావా
ఆసల శ్రీవేంకటేశ అట్టే నన్నుఁ గూడితివి
బేసబెల్లిరతులలోఁ బెంటలాయఁ గళలు
(||pallavi||)
ĕṁta sese vemoyi yĕṟam̐garā iṁdarunu
siṁtagāyagajjāyamai sippilīm̐ damagamu
(||ĕṁta||)
paligi yĕvvarinaina bhrama̮iṁchaneravā
vĕlam̐dula nammiṁcha nīvidyagādā
palumāru mādonela bāsalu veyavachchevu
sĕlavinavvulalone sem̐galĕkkī nijamu
(||ĕṁta||)
seyichchi vāḍavārini sikkiṁchugonobavā
sāyalu sesuga mĕchcha jāṇavugāvā
kāyagabunananubela kalayam̐gam̐bĕṭṭevu
toyarānivāvulane dŏḍḍim̐ jikkĕvalabu
(||ĕṁta||)
sesavĕṭṭi iṁtulanum̐ jeri pĕṁḍlāḍam̐ gŏṁkevā
vāsulu rem̐sam̐ga devaravu gāvā
āsala śhrīveṁkaḍeśha aṭṭe nannum̐ gūḍidivi
besabĕlliradulalom̐ bĕṁṭalāyam̐ gaḽalu