ఎంత సేసే వేమయ్యా ఇంతలోననే
(॥పల్లవి॥)
ఎంత సేసే వేమయ్యా ఇంతలోననే
మంతనములాడితేనే మలసేటిదాననా
(॥ఎంత॥)
వాఁడి గోరఁ జెక్కునొక్కి వదనము చేతనెత్తి
వేఁడుకొనే విట్టె నన్ను వింతదాననా
పోఁడిమి నండకు వచ్చి పొత్తనఁబెట్టుకొంటివి
నేఁడు నన్ను మన్నించితే నీ సరిదాననా
(॥ఎంత॥)
చుట్టరికములు చెప్పి చొక్కులఁబెట్టి తగిలి
అట్టె పొదిగేవు నీవియ్యపుదాననా
బెట్టుగా సరసమాడి ప్రేమఁజన్నులంటితివి
నెట్టుకొని నవ్వితేనే నీటు చూపేదాననా
(॥ఎంత॥)
గరిమఁ దప్పక చూచి కాఁగిటిలోపలఁగూడి
తొరలించేవు రతులు దొమ్మిదాననా
ఇరవై శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిపుడు
మరిగించినంతలోనే మర్మమెత్తేదాననా
(||pallavi||)
ĕṁta sese vemayyā iṁtalonane
maṁtanamulāḍidene malaseḍidānanā
(||ĕṁta||)
vām̐ḍi goram̐ jĕkkunŏkki vadanamu sedanĕtti
vem̐ḍugŏne viṭṭĕ nannu viṁtadānanā
pom̐ḍimi naṁḍagu vachchi pŏttanam̐bĕṭṭugŏṁṭivi
nem̐ḍu nannu manniṁchide nī saridānanā
(||ĕṁta||)
suṭṭarigamulu sĕppi sŏkkulam̐bĕṭṭi tagili
aṭṭĕ pŏdigevu nīviyyabudānanā
bĕṭṭugā sarasamāḍi premam̐jannulaṁṭidivi
nĕṭṭugŏni navvidene nīḍu sūbedānanā
(||ĕṁta||)
garimam̐ dappaga sūsi kām̐giḍilobalam̐gūḍi
tŏraliṁchevu radulu dŏmmidānanā
iravai śhrī veṁkaḍeśha yelidivi nannu nibuḍu
marigiṁchinaṁtalone marmamĕttedānanā