Emta seppinaa maanamdu yideme taanu

ఎంత చెప్పినా మానఁడు యిదేమే తాను
Language

(॥పల్లవి॥)
ఎంత చెప్పినా మానఁడు యిదేమే తాను
చెంతనుండి నామీఁదఁ జేయివేసీఁ దాను

(॥ఎంత॥)
యెక్కడ నుండి వచ్చెనే యీతఁడు నన్నుఁ బొదిగి
చక్కఁదనము వొగిడీ సారెసారెకు
నిక్కినిక్కి నన్నుఁజూచీ నే సిగ్గుతో నుండఁగాను
వెక్కసాన నవ్వుకొంటా వీడెమిచ్చీ నాకును

(॥ఎంత॥)
యెన్ని నేరుచుకొన్నాఁడే ఇప్పు డీమాయకాఁడు నా
చన్నులు పయ్యదఁ గప్పీ జారెనంటాను
చిన్నినిమ్మపంట వేసి చేరి నే నొడ్డించుకోఁగా
కన్నెపడుచను యేల కాకుసేసీ నన్నును

(॥ఎంత॥)
యేమి జాణతనమే తా నిదె శ్రీవేంకటేశుఁడు
మోము వంచఁగానే నాకు ముడిచీఁ గొప్పు
ఆముక యలమేల్మంగననఁగానే నన్నుఁగూడి
ప్రేమముతో వేడుకకుఁ బేరడిగీ నిన్నును

(||pallavi||)
ĕṁta sĕppinā mānam̐ḍu yideme tānu
sĕṁtanuṁḍi nāmīm̐dam̐ jeyivesīm̐ dānu

(||ĕṁta||)
yĕkkaḍa nuṁḍi vachchĕne yīdam̐ḍu nannum̐ bŏdigi
sakkam̐danamu vŏgiḍī sārĕsārĕgu
nikkinikki nannum̐jūsī ne siggudo nuṁḍam̐gānu
vĕkkasāna navvugŏṁṭā vīḍĕmichchī nāgunu

(||ĕṁta||)
yĕnni nerusugŏnnām̐ḍe ippu ḍīmāyagām̐ḍu nā
sannulu payyadam̐ gappī jārĕnaṁṭānu
sinninimmabaṁṭa vesi seri ne nŏḍḍiṁchugom̐gā
kannĕbaḍusanu yela kāgusesī nannunu

(||ĕṁta||)
yemi jāṇadaname tā nidĕ śhrīveṁkaḍeśhum̐ḍu
momu vaṁcham̐gāne nāgu muḍisīm̐ gŏppu
āmuga yalamelmaṁgananam̐gāne nannum̐gūḍi
premamudo veḍugagum̐ beraḍigī ninnunu