ఎంత చెప్పనా మానవు ఇది యేఁటికే
(॥పల్లవి॥)
ఎంత చెప్పనా మానవు ఇది యేఁటికే
వింతసేసి రమణుని వెంగెమాడ నేఁటికే
(॥ఎంత॥)
చెక్కునొక్కి నీవు బుద్ది చెప్పరాదా తొలుతనె
ఇక్కడ నాతని తప్పు లెంచనేఁటికె
చక్కనిపతిని నీవు జంట వాయకుండరాదా
నిక్కిచూచి నేఁడతని నిందలాడ నేఁటికే
(॥ఎంత॥)
ఆయమంటి మొదలనే ఆనవెట్టించుకోరాదా
వాయితప్పి యిప్పు డిఁక వాదు లేఁటికే
చేయివేసి కాఁగిటనే చిక్కించుకొనరాదా
బాయిటికిఁ దీసి వేరె పగచాటనేఁటికే
(॥ఎంత॥)
యెదుట శ్రీవేంకటేశు నిన్నియు నడుగరాదా
అదన నాతనిపై వేగంపనేఁటికే
వుదుటురతులఁ గూడి వొక్క బుద్దినుండరాదా
అదివో వురమెక్కియు ననుమేఁటికే
(||pallavi||)
ĕṁta sĕppanā mānavu idi yem̐ṭige
viṁtasesi ramaṇuni vĕṁgĕmāḍa nem̐ṭige
(||ĕṁta||)
sĕkkunŏkki nīvu buddi sĕpparādā tŏludanĕ
ikkaḍa nādani tappu lĕṁchanem̐ṭigĕ
sakkanibadini nīvu jaṁṭa vāyaguṁḍarādā
nikkisūsi nem̐ḍadani niṁdalāḍa nem̐ṭige
(||ĕṁta||)
āyamaṁṭi mŏdalane ānavĕṭṭiṁchugorādā
vāyidappi yippu ḍim̐ka vādu lem̐ṭige
seyivesi kām̐giḍane sikkiṁchugŏnarādā
bāyiḍigim̐ dīsi verĕ pagasāḍanem̐ṭige
(||ĕṁta||)
yĕduḍa śhrīveṁkaḍeśhu ninniyu naḍugarādā
adana nādanibai vegaṁpanem̐ṭige
vuduḍuradulam̐ gūḍi vŏkka buddinuṁḍarādā
adivo vuramĕkkiyu nanumem̐ṭige