Emta priyamu seppinaa neṟamgavoddaa neevu

ఎంత ప్రియము చెప్పినా నెఱఁగవొద్దా నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత ప్రియము చెప్పినా నెఱఁగవొద్దా నీవు
మంతనాన నిప్పుడుగా మంచిమాటలాడేవు

(॥ఎంత॥)
గయ్యాళి యెవ్వతెయైనా గడువనాడినఁగాక
చయ్యన నీవొజలు చక్కనయ్యీనా
కొయ్యతనమునను నీకొప్పువట్టితియ్యక
నెయ్యమునఁ బిలిచితే నీవు వచ్చేవా

(॥ఎంత॥)
పంతగత్తెయైనది బలిమి సేసినఁగాక
చెంతనుండి చెప్పినట్టు సేసేవా నీవు
జంతవలె బొమ్మలను జంకించి పెనఁగక
కాంతలకు నీ వూరికే కరఁగేటివాఁడవా

(॥ఎంత॥)
కావరపుది నీమోవి గంటినేసినఁగాక
శ్రీవేంకటేశ నీవు సిగ్గువడేవా
సేవించి యలమేల్‌మంగ చెప్పఁగా నన్నేలితివి
చేవమీరి కోరక చేతికిలోనయ్యేవా

(||pallavi||)
ĕṁta priyamu sĕppinā nĕṟam̐gavŏddā nīvu
maṁtanāna nippuḍugā maṁchimāḍalāḍevu

(||ĕṁta||)
gayyāḽi yĕvvadĕyainā gaḍuvanāḍinam̐gāga
sayyana nīvŏjalu sakkanayyīnā
kŏyyadanamunanu nīgŏppuvaṭṭidiyyaga
nĕyyamunam̐ biliside nīvu vachchevā

(||ĕṁta||)
paṁtagattĕyainadi balimi sesinam̐gāga
sĕṁtanuṁḍi sĕppinaṭṭu sesevā nīvu
jaṁtavalĕ bŏmmalanu jaṁkiṁchi pĕnam̐gaga
kāṁtalagu nī vūrige karam̐geḍivām̐ḍavā

(||ĕṁta||)
kāvarabudi nīmovi gaṁṭinesinam̐gāga
śhrīveṁkaḍeśha nīvu sigguvaḍevā
seviṁchi yalamel‌maṁga sĕppam̐gā nannelidivi
sevamīri koraga sedigilonayyevā