Emta priyaalu seppeve yedaleni yaasodaana

ఎంత ప్రియాలు చెప్పేవే యేడలేని యాసోదాన
Language

(॥పల్లవి॥)
ఎంత ప్రియాలు చెప్పేవే యేడలేని యాసోదాన
వింత లే కాతఁడు గారవించెనంటాను

(॥ఎంత॥)
చెక్కులేల నొక్కేవే చిత్తమేల కలఁచేవే
మిక్కిలి పతితో మందెమేళానను
వక్కణ లెన్నడిగేవే వాడికేమి చూపేవే
మక్కువ నాతఁడు నిన్ను మన్నించెనంటాను

(॥ఎంత॥)
చన్నుల నెంత వొత్తేవే సరసమే మాడేవే
సన్నల నాతఁడేలిన సలిగెలను
విన్నపా లెంత సేసేవే విడే లెన్ని యిచ్చేవే
పన్నుక యాతఁడు నీపై బత్తిగలఁడంటాను

(॥ఎంత॥)
పచ్చిగా నెంత నవ్వేవే పైకొని యేల చొక్కేవే
యిచ్చ నాతఁడు గూడిన యెమ్మెలను
తచ్చి శ్రీవేంకటేశుఁడు తానే నిన్ను మరిగించె
వచ్చి యెంత తగిలేవే వలచెనంటాను

(||pallavi||)
ĕṁta priyālu sĕppeve yeḍaleni yāsodāna
viṁta le kādam̐ḍu gāraviṁchĕnaṁṭānu

(||ĕṁta||)
sĕkkulela nŏkkeve sittamela kalam̐seve
mikkili padido maṁdĕmeḽānanu
vakkaṇa lĕnnaḍigeve vāḍigemi sūbeve
makkuva nādam̐ḍu ninnu manniṁchĕnaṁṭānu

(||ĕṁta||)
sannula nĕṁta vŏtteve sarasame māḍeve
sannala nādam̐ḍelina saligĕlanu
vinnabā lĕṁta seseve viḍe lĕnni yichcheve
pannuga yādam̐ḍu nībai battigalam̐ḍaṁṭānu

(||ĕṁta||)
pachchigā nĕṁta navveve paigŏni yela sŏkkeve
yichcha nādam̐ḍu gūḍina yĕmmĕlanu
tachchi śhrīveṁkaḍeśhum̐ḍu tāne ninnu marigiṁchĕ
vachchi yĕṁta tagileve valasĕnaṁṭānu