Emta pomdogaani tolli yeebegu neegu

ఎంత పొందోకాని తొల్లి యీపెకు నీకు
Language

(॥పల్లవి॥)
ఎంత పొందోకాని తొల్లి యీపెకు నీకు
వింతలేక చెనకీని వెల్లవిరిగాను

(॥ఎంత॥)
పొంచి పొంచి జవరాలు పూవుల నిన్ను వేసీని
కొంచ కిదె తెరమఱఁగున నుండి
లంచముగ మోవి చూపి లాసి సన్నసేసీనిన్ను
మంచము పైకి రమ్మని, మఱవకు మిఁకను

(॥ఎంత॥)
బంగారు చిమ్మనఁ గోవిఁ బన్నీరు నీపైఁ జిమ్మీ
సంగతిగాను కంబము చాటున నుండి
చెంగట నుండి ముత్యాల సేసలు నీపైఁ జల్లీ
యింగితాన రతులకు నెచ్చరించీ నిన్నును

(॥ఎంత॥)
కంకణాల చేతులను కప్పరము నీకు నిచ్చీ
పొంకమై చెలి మాఁటునఁ బూఁచుక వుండి
అంకెల శ్రీవేంకటేశ అన్నిటా నన్నేలితివి
కొంకక తా నిన్ను జేరి కొసరీఁ గూరిములు

(||pallavi||)
ĕṁta pŏṁdogāni tŏlli yībĕgu nīgu
viṁtalega sĕnagīni vĕllavirigānu

(||ĕṁta||)
pŏṁchi pŏṁchi javarālu pūvula ninnu vesīni
kŏṁcha kidĕ tĕramaṟam̐guna nuṁḍi
laṁchamuga movi sūbi lāsi sannasesīninnu
maṁchamu paigi rammani, maṟavagu mim̐kanu

(||ĕṁta||)
baṁgāru simmanam̐ govim̐ bannīru nībaim̐ jimmī
saṁgadigānu kaṁbamu sāḍuna nuṁḍi
sĕṁgaḍa nuṁḍi mutyāla sesalu nībaim̐ jallī
yiṁgidāna radulagu nĕchchariṁchī ninnunu

(||ĕṁta||)
kaṁkaṇāla sedulanu kapparamu nīgu nichchī
pŏṁkamai sĕli mām̐ṭunam̐ būm̐suga vuṁḍi
aṁkĕla śhrīveṁkaḍeśha anniḍā nannelidivi
kŏṁkaga tā ninnu jeri kŏsarīm̐ gūrimulu