Emta panigogaani yeṟamga nenu

ఎంత పనికోకాని యెఱఁగ నేను
Language

(॥పల్లవి॥)
ఎంత పనికోకాని యెఱఁగ నేను
చెంతనే తెలుసుకో నేఁ జెప్పితి నీ సుద్దులు

(॥ఎంత॥)
వదలేజారుఁ దురుము వైపుగా ముడుచుకొంటా
కదలుఁగన్నులచూపు కాఁడిపారఁగా
మదమువలెనే పెంజెమటలు చెక్కులఁ గార
వెదకీ నెవ్వతో నిన్ను వీదులవీదులను

(॥ఎంత॥)
అడఁచి చన్నులపైఁ బయ్యద బిగిఇంచుకొంటా
కడలేని నిట్టూర్పులు కడుమఁగాను
తడఁబడఁ బెదవుల తమ్మబేంట్లు రాలఁగా
అడిగీ నీవున్నచోటు అంగవలనెల్లాను

(॥ఎంత॥)
వుక్కుమీరి కరముల వొడిమీదఁ బెట్టుకొని
మిక్కిలి నీకాపె పొందు మీఁ దెత్తఁగా
ఇక్కడ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడేవు
చొక్కుచు నీమేడదిక్కే చూచీఁ దా నదివో

(||pallavi||)
ĕṁta panigogāni yĕṟam̐ga nenu
sĕṁtane tĕlusugo nem̐ jĕppidi nī suddulu

(||ĕṁta||)
vadalejārum̐ durumu vaibugā muḍusugŏṁṭā
kadalum̐gannulasūbu kām̐ḍibāram̐gā
madamuvalĕne pĕṁjĕmaḍalu sĕkkulam̐ gāra
vĕdagī nĕvvado ninnu vīdulavīdulanu

(||ĕṁta||)
aḍam̐si sannulabaim̐ bayyada bigiiṁchugŏṁṭā
kaḍaleni niṭṭūrbulu kaḍumam̐gānu
taḍam̐baḍam̐ bĕdavula tammabeṁṭlu rālam̐gā
aḍigī nīvunnasoḍu aṁgavalanĕllānu

(||ĕṁta||)
vukkumīri karamula vŏḍimīdam̐ bĕṭṭugŏni
mikkili nīgābĕ pŏṁdu mīm̐ dĕttam̐gā
ikkaḍa śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍevu
sŏkkusu nīmeḍadikke sūsīm̐ dā nadivo