Emta nijamarivi ninne mi seppedi

ఎంత నిజమరివి నిన్నే మి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత నిజమరివి నిన్నే మి చెప్పేది
బంతినే నోరూరించే బాగు లింతేకాక

(॥ఎంత॥)
నెలఁతపై బత్తిగలితేనిన్న రాకవుందువా
పెలుచవై కన్నప్పటిబేఁట మేకాక
తలఁపులో నుండితేను తమకించకుందువా
పలికి కొసరేవేళ పచారాలేకాక

(॥ఎంత॥)
చేరి కూడ వేడుకైతే సిగ్గులువడుదువా
వూరట సరసాలాడే వుబ్బులుగాక
నారుకొన్నపనులైతే నవ్వులు నవ్వుదువా
పోరచి చుట్టరికాల పొందు లింతేకాక

(॥ఎంత॥)
ఆయములు గరఁగితే నండఁ బవ్వలింతువా
కాయకపు ప్రియముల గచ్చులుగాక
యీయెడ శ్రీవేంకటేశ యింతలో నేలితి వీకె
చాయమరుఁడు వుట్టించేచవు లింతేకాక

(||pallavi||)
ĕṁta nijamarivi ninne mi sĕppedi
baṁtine norūriṁche bāgu liṁtegāga

(||ĕṁta||)
nĕlam̐tabai battigalideninna rāgavuṁduvā
pĕlusavai kannappaḍibem̐ṭa megāga
talam̐pulo nuṁḍidenu tamagiṁchaguṁduvā
paligi kŏsareveḽa pasārālegāga

(||ĕṁta||)
seri kūḍa veḍugaide sigguluvaḍuduvā
vūraḍa sarasālāḍe vubbulugāga
nārugŏnnabanulaide navvulu navvuduvā
porasi suṭṭarigāla pŏṁdu liṁtegāga

(||ĕṁta||)
āyamulu garam̐gide naṁḍam̐ bavvaliṁtuvā
kāyagabu priyamula gachchulugāga
yīyĕḍa śhrīveṁkaḍeśha yiṁtalo nelidi vīgĕ
sāyamarum̐ḍu vuṭṭiṁchesavu liṁtegāga