ఎంత నేరుచుకొంటివి యేమందు నిన్ను
(॥పల్లవి॥)
ఎంత నేరుచుకొంటివి యేమందు నిన్ను
మంతుకెక్క నెంచేఁగాని మతకము గాదు
(॥ఎంత॥)
తరుణులఁగంటే నీవు తగిలేయాసోదానను
వెరగై వుందానఁగాని వేసాలు గావు
మరిగించి నీవాడేటిమాఁట నయగారాలకు
అరుదందేఁగాని నీపై నాగడము గాదు
(॥ఎంత॥)
తోడనే నీ మొగమునఁ దొలఁకేకళలు చూచి
వేడుకకు నవ్వేఁగాని వెంగెము గాదు
యేడనుండైనా వచ్చి ఇంపులు సేసేయందుకు
జాడతో మొక్కేఁగాని సటలు గావు
(॥ఎంత॥)
ఇచ్చకము లెల్లాఁజేసి ఇట్టె నన్నుఁ గూడఁగాను
రచ్చకెక్కి మెచ్చేఁగాని రవ్వలు గావు
మచ్చిక శ్రీవేంకటేశ మన్నించితి విటు నన్ను
కొచ్చి సంతోసించేఁగాని కొసరు గాదు
(||pallavi||)
ĕṁta nerusugŏṁṭivi yemaṁdu ninnu
maṁtugĕkka nĕṁchem̐gāni madagamu gādu
(||ĕṁta||)
taruṇulam̐gaṁṭe nīvu tagileyāsodānanu
vĕragai vuṁdānam̐gāni vesālu gāvu
marigiṁchi nīvāḍeḍimām̐ṭa nayagārālagu
arudaṁdem̐gāni nībai nāgaḍamu gādu
(||ĕṁta||)
toḍane nī mŏgamunam̐ dŏlam̐kegaḽalu sūsi
veḍugagu navvem̐gāni vĕṁgĕmu gādu
yeḍanuṁḍainā vachchi iṁpulu seseyaṁdugu
jāḍado mŏkkem̐gāni saḍalu gāvu
(||ĕṁta||)
ichchagamu lĕllām̐jesi iṭṭĕ nannum̐ gūḍam̐gānu
rachchagĕkki mĕchchem̐gāni ravvalu gāvu
machchiga śhrīveṁkaḍeśha manniṁchidi viḍu nannu
kŏchchi saṁtosiṁchem̐gāni kŏsaru gādu