Emta nerusugomtive innidigi gurigaanu

ఎంత నేరుచుకొంటివే ఇన్నిటికి గురిగాను
Language

(॥పల్లవి॥)
ఎంత నేరుచుకొంటివే ఇన్నిటికి గురిగాను
కాంతునిఁ జూపి యెఱఁగని యట్టుందానవు

(॥ఎంత॥)
అంది పతితో నేకతమాడ నేరుతువుగాని
అందరిముందర మాటలాడనేరవే
కందువ నన్ను నప్పటి గయ్యాళిఁ జేసి, నిన్ను-
నొందిలి యేమాడిన నోరుచుకుందానవు

(॥ఎంత॥)
పిలిచి యాతని నింటఁ బెట్టుకోనేర్తువుగాని
అలరి మావరుసకు నంపనేరవే
పలుమారు నేవచ్చినపనులు రట్టు కెక్కించి
చలమునే సాదించితే సాదవైయుందానవు

(॥ఎంత॥)
కోరి శ్రీవేంకటేశ్వరుఁ గూడగఁనేర్తువుగాని
చేరి మాకు వినయాలు సేయనేరవే
నేరిచి నన్నితడేలె నే నలమేలు మంగను
సారె నే నవ్వితే సంతోసాననే వుందానవు

(||pallavi||)
ĕṁta nerusugŏṁṭive inniḍigi gurigānu
kāṁtunim̐ jūbi yĕṟam̐gani yaṭṭuṁdānavu

(||ĕṁta||)
aṁdi padido negadamāḍa neruduvugāni
aṁdarimuṁdara māḍalāḍanerave
kaṁduva nannu nappaḍi gayyāḽim̐ jesi, ninnu-
nŏṁdili yemāḍina norusuguṁdānavu

(||ĕṁta||)
pilisi yādani niṁṭam̐ bĕṭṭugonerduvugāni
alari māvarusagu naṁpanerave
palumāru nevachchinabanulu raṭṭu kĕkkiṁchi
salamune sādiṁchide sādavaiyuṁdānavu

(||ĕṁta||)
kori śhrīveṁkaḍeśhvarum̐ gūḍagam̐nerduvugāni
seri māgu vinayālu seyanerave
nerisi nannidaḍelĕ ne nalamelu maṁganu
sārĕ ne navvide saṁtosānane vuṁdānavu