Emta nerusugomtive imtiro neevu

ఎంత నేరుచుకొంటివే ఇంతిరో నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత నేరుచుకొంటివే ఇంతిరో నీవు
వింత లిందరి ముందర వెలఇంచితివౌనే

(॥ఎంత॥)
బెల్లాలవంటి మాఁటలు పెదవులపై నాడి
పెల్లున మగని వలపించితివౌనే
వల్లెవేససినటువలె వాడికలు పచరించి
కొల్లగా నాతని దక్కఁగొంటివి నీవౌనే

(॥ఎంత॥)
పువ్వులచేనెత్తినట్లు పొసఁగ వావులు చెప్పి
చివ్వనఁ దమకము రేఁచితివౌనే
వువ్విళ్ళూర మేనుసోఁక వొద్ద నిట్టె కూచుండి
యివ్వల నాతని సాదించితివౌనే

(॥ఎంత॥)
వెన్నెలగాసినట్ల వేడుకచూపులు చూచి
యెన్నికరతుల నెలయించితివౌనే
అన్నిటా శ్రీవేంకటేశుఁ డాతఁ డిట్టె నన్ను నేలె
చెన్నుగ నీ విట్టె చాయసేసుకొంటివౌనే

(||pallavi||)
ĕṁta nerusugŏṁṭive iṁtiro nīvu
viṁta liṁdari muṁdara vĕla̮iṁchidivaune

(||ĕṁta||)
bĕllālavaṁṭi mām̐ṭalu pĕdavulabai nāḍi
pĕlluna magani valabiṁchidivaune
vallĕvesasinaḍuvalĕ vāḍigalu pasariṁchi
kŏllagā nādani dakkam̐gŏṁṭivi nīvaune

(||ĕṁta||)
puvvulasenĕttinaṭlu pŏsam̐ga vāvulu sĕppi
sivvanam̐ damagamu rem̐sidivaune
vuvviḽḽūra menusom̐ka vŏdda niṭṭĕ kūsuṁḍi
yivvala nādani sādiṁchidivaune

(||ĕṁta||)
vĕnnĕlagāsinaṭla veḍugasūbulu sūsi
yĕnnigaradula nĕlayiṁchidivaune
anniḍā śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ ḍiṭṭĕ nannu nelĕ
sĕnnuga nī viṭṭĕ sāyasesugŏṁṭivaune