ఎంత నేరుపరివి నిన్నేమి చెప్పేది
(॥పల్లవి॥)
ఎంత నేరుపరివి నిన్నేమి చెప్పేది
వింతవానివలెనే భావించేవా నీవు
(॥ఎంత॥)
సారెకుఁ జూచేవాఁడవు సన్నలు సేసేవాఁడవు
ఆరమణిపేరు నన్ను నడిగేవా
గారవించి యట్టె వుడుగరలంపేవాఁడవు
యీరీతిఁ దల) కుళము లెఱఁగవా నీవు
(॥ఎంత॥)
యింటికి రప్పించేవాఁడ విచ్చకమాడేవాఁడవు
అంటి నాతో నాపెసుద్దు లరసేవా
వొంటి నేకతములాడి వొరసి నవ్వేవాఁడవు
వెంటనే యాపె గుణాలు వెదకేవా నీవు
(॥ఎంత॥)
సరి నెడమాటలకు సతులనంపేవాడవు
తరుణి చెల్లెలంటా నిందలు గట్టేవా
నిరతి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
సరతి నన్నేలితివి చక్కటి దిద్దేవా
(||pallavi||)
ĕṁta nerubarivi ninnemi sĕppedi
viṁtavānivalĕne bhāviṁchevā nīvu
(||ĕṁta||)
sārĕgum̐ jūsevām̐ḍavu sannalu sesevām̐ḍavu
āramaṇiberu nannu naḍigevā
gāraviṁchi yaṭṭĕ vuḍugaralaṁpevām̐ḍavu
yīrīdim̐ dala) kuḽamu lĕṟam̐gavā nīvu
(||ĕṁta||)
yiṁṭigi rappiṁchevām̐ḍa vichchagamāḍevām̐ḍavu
aṁṭi nādo nābĕsuddu larasevā
vŏṁṭi negadamulāḍi vŏrasi navvevām̐ḍavu
vĕṁṭane yābĕ guṇālu vĕdagevā nīvu
(||ĕṁta||)
sari nĕḍamāḍalagu sadulanaṁpevāḍavu
taruṇi sĕllĕlaṁṭā niṁdalu gaṭṭevā
niradi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
saradi nannelidivi sakkaḍi diddevā