(॥పల్లవి॥)
ఎంత నేర్చెనే యీలేమ పువు-
బంతివాట్లనే బడలీని
(॥ఎంత॥)
వాలుకచూపులు వంచి చెలి పతిఁ
గోలుముందుగా గొణఁగీని
చాలుగ నడచి సారెకు నిలిచి
వీటుచుఁ బయ్యద విసరీని
(॥ఎంత॥)
చెదరిననెరు లటుచెరిగి యిటు నటు-
నుదుటనఁ జెలిపై నొరగీని
కొదలుచుఁ బలికి కోపమె చిలికి
చెదరగ నవ్వులు చిందీని
(॥ఎంత॥)
సరసపు సిగ్గులు చల్లీని తన-
కరము చెక్కుపైఁ గప్పీని
యిరవుగ శ్రీవేంకటేశుఁ గలసి తాఁ
నరమరపున ముదమందీని
(||pallavi||)
ĕṁta nersĕne yīlema puvu-
baṁtivāṭlane baḍalīni
(||ĕṁta||)
vālugasūbulu vaṁchi sĕli padim̐
golumuṁdugā gŏṇam̐gīni
sāluga naḍasi sārĕgu nilisi
vīḍusum̐ bayyada visarīni
(||ĕṁta||)
sĕdarinanĕru laḍusĕrigi yiḍu naḍu-
nuduḍanam̐ jĕlibai nŏragīni
kŏdalusum̐ baligi kobamĕ siligi
sĕdaraga navvulu siṁdīni
(||ĕṁta||)
sarasabu siggulu sallīni tana-
karamu sĕkkubaim̐ gappīni
yiravuga śhrīveṁkaḍeśhum̐ galasi tām̐
naramarabuna mudamaṁdīni