ఎంత నేరిపితివో యీపెకు నీవు
(॥పల్లవి॥)
ఎంత నేరిపితివో యీపెకు నీవు
చెంతలఁ దొల్లి నేరదు చిమ్మిరేఁగీ నిప్పుడు
(॥ఎంత॥)
బత్తిసేసి రమణి నీపైఁ జేతులు వేసి
సత్తుగా వీఁపునఁ దనచన్నులు రాసీ
మొత్తమున వలపులు ముచ్చటల నెగపోసి
కొత్తపుపాయాల నిన్నుఁ గొసరీ నదివో
(॥ఎంత॥)
మనసులోపల నీమంతనములే కోరి
నునుపైననీమోవికి నోరూరీని
చెనకి నీకాఁగిటికి సిగ్గులతోనే చేరి
చనవులు నెరపీని సారెసారె నదివో
(॥ఎంత॥)
చెలరేఁగి నీమీఁదిచిందు లిన్నియునుఁ బాడి
బలిమిసేసి నీతోఁ బంతములాడి
యెలమి నన్నేలితివి ఇట్టె నిన్ను నాపె గూడి
అలరి శ్రీవేంకటేశ యందిమెచ్చీ నదివో
(||pallavi||)
ĕṁta neribidivo yībĕgu nīvu
sĕṁtalam̐ dŏlli neradu simmirem̐gī nippuḍu
(||ĕṁta||)
battisesi ramaṇi nībaim̐ jedulu vesi
sattugā vīm̐punam̐ danasannulu rāsī
mŏttamuna valabulu muchchaḍala nĕgabosi
kŏttabubāyāla ninnum̐ gŏsarī nadivo
(||ĕṁta||)
manasulobala nīmaṁtanamule kori
nunubainanīmovigi norūrīni
sĕnagi nīgām̐giḍigi sigguladone seri
sanavulu nĕrabīni sārĕsārĕ nadivo
(||ĕṁta||)
sĕlarem̐gi nīmīm̐disiṁdu linniyunum̐ bāḍi
balimisesi nīdom̐ baṁtamulāḍi
yĕlami nannelidivi iṭṭĕ ninnu nābĕ gūḍi
alari śhrīveṁkaḍeśha yaṁdimĕchchī nadivo