Emta neevu sesinaa nenela maanenu

ఎంత నీవు సేసినా నేనేల మానేను
Language

(॥పల్లవి॥)
ఎంత నీవు సేసినా నేనేల మానేను
పంతములు నెరపి నేఁ బైకొనేనంటాను

(॥ఎంత॥)
నెట్టన మొక్కులు మొక్క నేరుచుకుంటివి నీవు
తిట్టులు దిట్టి యేమైనాఁ దెలిపేనంటా
చుట్టమవై నాతోనే సుద్దులు చెప్పేవు నీవు
జట్టిగా నిన్ను జంకించి సాదించేనంటాను

(॥ఎంత॥)
వినయాలు చూపి నాతో వేసాలు సేసేవు నీవు
ననుపు నీచేఁతలకు నవ్వేనంటా
మనసు నమ్మినదాఁకా మందులు నూరేవు నీవు
పెనఁగి నేనిట్లానే చెల్లించే నంటాను

(॥ఎంత॥)
నిలువునఁ గాఁగిలించి నివ్వెరగందేవు నీవు
తలపించి నీ గుణాలు తడవే నంటా
అలర శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
చెలరేఁగి నిన్ను రట్టుసేసే నంటాను

(||pallavi||)
ĕṁta nīvu sesinā nenela mānenu
paṁtamulu nĕrabi nem̐ baigŏnenaṁṭānu

(||ĕṁta||)
nĕṭṭana mŏkkulu mŏkka nerusuguṁṭivi nīvu
tiṭṭulu diṭṭi yemainām̐ dĕlibenaṁṭā
suṭṭamavai nādone suddulu sĕppevu nīvu
jaṭṭigā ninnu jaṁkiṁchi sādiṁchenaṁṭānu

(||ĕṁta||)
vinayālu sūbi nādo vesālu sesevu nīvu
nanubu nīsem̐talagu navvenaṁṭā
manasu namminadām̐kā maṁdulu nūrevu nīvu
pĕnam̐gi neniṭlāne sĕlliṁche naṁṭānu

(||ĕṁta||)
niluvunam̐ gām̐giliṁchi nivvĕragaṁdevu nīvu
talabiṁchi nī guṇālu taḍave naṁṭā
alara śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
sĕlarem̐gi ninnu raṭṭusese naṁṭānu