ఎంత నీవు మోహించినా ఇల్లాల నేను
(॥పల్లవి॥)
ఎంత నీవు మోహించినా ఇల్లాల నేను
చెంత నీ యానతి నేను సేసేనయ్యా
(॥॥)
పాయక నీవు మన్నించి పలుమారు బోధించినా
సేయరానివిన్నపాలు సేయనచ్చునా
వేయిమారులు నన్ను వేఁడుకొంటివంటాను
నాయముగానిరతులు నడపఁగవచ్చునా
(॥॥)
వొయ్యన నీవెటువలె నూరడించి పెనఁగినా
నియ్యరానియీవులు ఇయ్యవచ్చునా
నెయ్యానఁ బెద్దరికము నీవెంత సేసినాను
చయ్యనా మందెమేళాలు జరపఁగవచ్చునా
(॥॥)
నగుతాఁ జనవులిచ్చి నన్నింత నీవు గూడినా
తగునీచేఁతలను పొందఁగవచ్చునా
నిగిడి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
తగులై ఇఁక నీవేడ తప్పించుకొనవచ్చునా
(||pallavi||)
ĕṁta nīvu mohiṁchinā illāla nenu
sĕṁta nī yānadi nenu sesenayyā
(||||)
pāyaga nīvu manniṁchi palumāru bodhiṁchinā
seyarānivinnabālu seyanachchunā
veyimārulu nannu vem̐ḍugŏṁṭivaṁṭānu
nāyamugāniradulu naḍabam̐gavachchunā
(||||)
vŏyyana nīvĕḍuvalĕ nūraḍiṁchi pĕnam̐ginā
niyyarāniyīvulu iyyavachchunā
nĕyyānam̐ bĕddarigamu nīvĕṁta sesinānu
sayyanā maṁdĕmeḽālu jarabam̐gavachchunā
(||||)
nagudām̐ janavulichchi nanniṁta nīvu gūḍinā
tagunīsem̐talanu pŏṁdam̐gavachchunā
nigiḍi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
tagulai im̐ka nīveḍa tappiṁchugŏnavachchunā