Emta neevu jaṟasina yemane ninnu

ఎంత నీవు జఱసిన యేమనే నిన్ను
Language

(॥పల్లవి॥)
ఎంత నీవు జఱసిన యేమనే నిన్ను
వంతువాసులెంచ కిట్టె వద్దనుండవయ్యా

(॥ఎంత॥)
చిక్కని తేనెల మోవి చేరి నాకు నియ్యగాను
చక్కెర మాటలాడితి సారె నీతోను
వక్కణ లడుగ నేల వట్టితల పోఁతలేల
వొక్కరీతిఁ జక్కజాడ నుండవయ్యా

(॥ఎంత॥)
చల్లని వలపుఁ జూపు సారె నాపై వంచఁగాను
మెల్లనినవ్వు నవ్వితి మించి నీతోను
చిల్లర ముచ్చటలేల చేవట్టిపెనఁగనేల
బల్లిదుఁడవై యిట్టె బతుకవయ్యా

(॥ఎంత॥)
కందువజాణతనాలఁ గాఁగిలించుకొనఁగాను
పొందితి రతుల నిన్ను భోగించితి
విందులఁ గూడితివి శ్రీ వేంకటేశ బాసలేల
సందడి నాకిటువంటిచన వియ్యవయ్యా

(||pallavi||)
ĕṁta nīvu jaṟasina yemane ninnu
vaṁtuvāsulĕṁcha kiṭṭĕ vaddanuṁḍavayyā

(||ĕṁta||)
sikkani tenĕla movi seri nāgu niyyagānu
sakkĕra māḍalāḍidi sārĕ nīdonu
vakkaṇa laḍuga nela vaṭṭidala pom̐talela
vŏkkarīdim̐ jakkajāḍa nuṁḍavayyā

(||ĕṁta||)
sallani valabum̐ jūbu sārĕ nābai vaṁcham̐gānu
mĕllaninavvu navvidi miṁchi nīdonu
sillara muchchaḍalela sevaṭṭibĕnam̐ganela
ballidum̐ḍavai yiṭṭĕ badugavayyā

(||ĕṁta||)
kaṁduvajāṇadanālam̐ gām̐giliṁchugŏnam̐gānu
pŏṁdidi radula ninnu bhogiṁchidi
viṁdulam̐ gūḍidivi śhrī veṁkaḍeśha bāsalela
saṁdaḍi nāgiḍuvaṁṭisana viyyavayyā