ఎంత నీపై వలపో యెటువంటి కూటములో
(॥పల్లవి॥)
ఎంత నీపై వలపో యెటువంటి కూటములో
వింత వింత వినోదాల విచారాల వెల సె
(॥ఎంత॥)
గుట్టుతోడ నిన్నెదురుకానేటిపరాకున
గట్టిచన్నులఁ బయ్యద గప్ప మఱచె
చుట్టి చట్టి నీమొగము చూచేటి వేడుకను
అట్టె చెలిచేతియాకు అందుకోను మఱచె
(॥ఎంత॥)
మలసి నీతోడుతను మాఁటాడె తమకమున
తిలకము లొసలను దిద్ద మఱచె
నలువంత నీతోను నవ్వే నిబ్బరమున
తొలఁగుఁ జెక్కుఁజెమట దుడుచుకో మరచె
(॥ఎంత॥)
కందువకు నిన్నుఁ దీసి కాఁగిలించీయాసోదాన
ముందు ముందుగాఁ దలువు ముయ్య మఱచె
యిందుముఖి శ్రీవేంకటేశ నీవు గూడఁగాను
పంది(దె?) మాడి కొనగోరఁ బచ్చిసేయ మఱచె
(||pallavi||)
ĕṁta nībai valabo yĕḍuvaṁṭi kūḍamulo
viṁta viṁta vinodāla visārāla vĕla sĕ
(||ĕṁta||)
guṭṭudoḍa ninnĕdurugāneḍibarāguna
gaṭṭisannulam̐ bayyada gappa maṟasĕ
suṭṭi saṭṭi nīmŏgamu sūseḍi veḍuganu
aṭṭĕ sĕlisediyāgu aṁdugonu maṟasĕ
(||ĕṁta||)
malasi nīdoḍudanu mām̐ṭāḍĕ tamagamuna
tilagamu lŏsalanu didda maṟasĕ
naluvaṁta nīdonu navve nibbaramuna
tŏlam̐gum̐ jĕkkum̐jĕmaḍa duḍusugo marasĕ
(||ĕṁta||)
kaṁduvagu ninnum̐ dīsi kām̐giliṁchīyāsodāna
muṁdu muṁdugām̐ daluvu muyya maṟasĕ
yiṁdumukhi śhrīveṁkaḍeśha nīvu gūḍam̐gānu
paṁdi(dĕ?) māḍi kŏnagoram̐ bachchiseya maṟasĕ