Emta nee raajasa midiyeme neevu

ఎంత నీ రాజస మిదియేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత నీ రాజస మిదియేమే నీవు
పంతపుఁ జేఁతల నిన్ను భ్రమఇంచ నేరఁడా

(॥ఎంత॥)
చక్కని వదనమున సన్నచేసె నాతఁడు
యెక్కడి పరాకు నీకు యేమే నీవు
వెక్కసపు చన్నులతో విఱ్ఱవీఁగేవు గర్వాన
మిక్కిలి రతులనవి మెదుపఁగ నేరఁడా

(॥ఎంత॥)
చిలుకుగోళ్ల చేతుల చెయివట్టె నాతఁడు
యెలమి మారు మలసేవేమే నీవు
నిలువుఁ దురుముతోడ నీవు కపటాలు చూపి
అలరి పంతాలు చూప నాతఁ డింత నేరఁడా

(॥ఎంత॥)
దొంతర సరసముల దొమ్మి చేసె నాతఁడు
యింతలోనె సిగ్గువడేవేమే నీవు
మంతనాన పయ్యదను మఱఁగువెట్టి కూడితి
వెంతైనా శ్రీ వేంకటేశుఁడిని మీర నేరఁడా

(||pallavi||)
ĕṁta nī rājasa midiyeme nīvu
paṁtabum̐ jem̐tala ninnu bhrama̮iṁcha neram̐ḍā

(||ĕṁta||)
sakkani vadanamuna sannasesĕ nādam̐ḍu
yĕkkaḍi parāgu nīgu yeme nīvu
vĕkkasabu sannulado viṭravīm̐gevu garvāna
mikkili radulanavi mĕdubam̐ga neram̐ḍā

(||ĕṁta||)
silugugoḽla sedula sĕyivaṭṭĕ nādam̐ḍu
yĕlami māru malaseveme nīvu
niluvum̐ durumudoḍa nīvu kabaḍālu sūbi
alari paṁtālu sūba nādam̐ ḍiṁta neram̐ḍā

(||ĕṁta||)
dŏṁtara sarasamula dŏmmi sesĕ nādam̐ḍu
yiṁtalonĕ sigguvaḍeveme nīvu
maṁtanāna payyadanu maṟam̐guvĕṭṭi kūḍidi
vĕṁtainā śhrī veṁkaḍeśhum̐ḍini mīra neram̐ḍā