Emta nannum bogadevu yeduvale bujjagimchi

ఎంత నన్నుఁ బొగడేవు యెటువలె బుజ్జగించి
Language

(॥పల్లవి॥)
ఎంత నన్నుఁ బొగడేవు యెటువలె బుజ్జగించి
వింతదాననా నీకు వినయపుటాలను

(॥ఎంత॥)
కోరికతో మగఁడు యేకోమలితో నవ్వినాను
నేరము లెంచనిదే నెలఁత
అరజాన తనమేన జీరలు దీయించుకొంటే
గారవించి పచ్చడానఁ గప్పినదే మగువ

(॥ఎంత॥)
వేడుక యేసతిమీఁద విభునికిఁ గలిగినా
తోడుకవచ్చినదే తొయ్యలి
కూడేవేళ యెంతేసియెక్కుడు ప్రియాలు చెప్పినా
ఆడుకోక వుండినదే అంగన

(॥ఎంత॥)
పచ్చిగారమణుఁడు యేపడఁతి బెండ్లాడినాను
ఇచ్చకమై యుండినదే ఇంతి
ఇచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నిచ్చలు నావంటిదే నీకు దేవులు

(||pallavi||)
ĕṁta nannum̐ bŏgaḍevu yĕḍuvalĕ bujjagiṁchi
viṁtadānanā nīgu vinayabuḍālanu

(||ĕṁta||)
korigado magam̐ḍu yegomalido navvinānu
neramu lĕṁchanide nĕlam̐ta
arajāna tanamena jīralu dīyiṁchugŏṁṭe
gāraviṁchi pachchaḍānam̐ gappinade maguva

(||ĕṁta||)
veḍuga yesadimīm̐da vibhunigim̐ galiginā
toḍugavachchinade tŏyyali
kūḍeveḽa yĕṁtesiyĕkkuḍu priyālu sĕppinā
āḍugoga vuṁḍinade aṁgana

(||ĕṁta||)
pachchigāramaṇum̐ḍu yebaḍam̐ti bĕṁḍlāḍinānu
ichchagamai yuṁḍinade iṁti
ichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nichchalu nāvaṁṭide nīgu devulu