Emta nannu vemdugone vimdugumgaanu

ఎంత నన్ను వేఁడుకొనే విందుకుఁగాను
Language

(॥పల్లవి॥)
ఎంత నన్ను వేఁడుకొనే విందుకుఁగాను
విఁతగా నా పంతము నీవే కనుఁగొనవే

(॥ఎంత॥)
వేసరకుంటేఁజాలు విన్నప మెట్టైనాఁ జేసి
ఆసవెట్టి నీపతిఁ జయ్యన తెచ్చేనే
చేసూటి కానికలు చేకొంటేనే చాలుఁగాని
సేసవెట్టి నీకుఁ బెండ్లిసేసే యాతనిని

(॥ఎంత॥)
మొదలనే దిష్టించి నా మొగము చూచితేఁజాలు
కదిసి నీచేతికి లోఁగా జేసేనే
చెదరనిమన్ననతో సెలవినవ్వితేఁజాలు
సదరాన నీపొందుకు సమ్మతించఁజేసేనే

(॥ఎంత॥)
సరవిగా నాముందర చక్కఁగా నిల్చితేఁజాలు
యిరవుగా నీతలఁపు లీడేర్చేనే
అరుదై శ్రీవేంకటేశుఁ డంతలోనె నిన్నుఁ గూడె
పరగ నీతో నెప్పుడుఁ బాయకుండఁ జేసేనే

(||pallavi||)
ĕṁta nannu vem̐ḍugŏne viṁdugum̐gānu
vim̐tagā nā paṁtamu nīve kanum̐gŏnave

(||ĕṁta||)
vesaraguṁṭem̐jālu vinnaba mĕṭṭainām̐ jesi
āsavĕṭṭi nībadim̐ jayyana tĕchchene
sesūḍi kānigalu segŏṁṭene sālum̐gāni
sesavĕṭṭi nīgum̐ bĕṁḍlisese yādanini

(||ĕṁta||)
mŏdalane diṣhṭiṁchi nā mŏgamu sūsidem̐jālu
kadisi nīsedigi lom̐gā jesene
sĕdaranimannanado sĕlavinavvidem̐jālu
sadarāna nībŏṁdugu sammadiṁcham̐jesene

(||ĕṁta||)
saravigā nāmuṁdara sakkam̐gā nilsidem̐jālu
yiravugā nīdalam̐pu līḍersene
arudai śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ ninnum̐ gūḍĕ
paraga nīdo nĕppuḍum̐ bāyaguṁḍam̐ jesene