ఎంత నన్ను వేఁడుకొనే విల్లాల నేను
(॥పల్లవి॥)
ఎంత నన్ను వేఁడుకొనే విల్లాల నేను
చెంత నిట్టె యేలుకో నీ చిత్తములోదానను
(॥ఎంత॥)
మోవి చూపి నోరూరించె మొకమిచ్చమాటలాడి
వావిచెప్పుకొనేయటువంటి దాననా
కావరించి సన్నసేసి కలపుకోలు సేసక
తావుకొని రతులకుఁ దగిలేఁటి దాననా
(॥ఎంత॥)
వాడిక వలపు చూపి వట్టి తరితీపు సేసి
జోడుకుఁ బెనఁగేటివాసులదాననా
వేడుక నవ్వులు నవ్వి వేసాలు ప్రియాలు చెప్పి
యేడనైనా మేలమాడే యేతుల దాననా
(॥ఎంత॥)
చనవులు సేసుకొని జక్కవ గుబ్బల నొత్తి
చెనకుచు నాసలు రేఁచే దాననా
యెనసితివి శ్రీ వేంకటేశ యింతలో నన్ను
పనివడి నేరుపులే పచరించే దాననా
(||pallavi||)
ĕṁta nannu vem̐ḍugŏne villāla nenu
sĕṁta niṭṭĕ yelugo nī sittamulodānanu
(||ĕṁta||)
movi sūbi norūriṁchĕ mŏgamichchamāḍalāḍi
vāvisĕppugŏneyaḍuvaṁṭi dānanā
kāvariṁchi sannasesi kalabugolu sesaga
tāvugŏni radulagum̐ dagilem̐ṭi dānanā
(||ĕṁta||)
vāḍiga valabu sūbi vaṭṭi taridību sesi
joḍugum̐ bĕnam̐geḍivāsuladānanā
veḍuga navvulu navvi vesālu priyālu sĕppi
yeḍanainā melamāḍe yedula dānanā
(||ĕṁta||)
sanavulu sesugŏni jakkava gubbala nŏtti
sĕnagusu nāsalu rem̐se dānanā
yĕnasidivi śhrī veṁkaḍeśha yiṁtalo nannu
panivaḍi nerubule pasariṁche dānanā