Emta nannu valabimche nidivo naa praaneshvari

ఎంత నన్ను వలపించె నిదివో నా ప్రాణేశ్వరి
Language

(॥పల్లవి॥)
ఎంత నన్ను వలపించె నిదివో నా ప్రాణేశ్వరి
వింత వింత సుద్దు లివి వింటివా వో చెలియా

(॥ఎంత॥)
చూచినట్టె వున్నది సుదతి చక్కని రూపు
యేచి నవ్వినట్టున్నది యెదుట నాతో
కూచున్నయట్టె వున్నది గొబ్బున నాసంగడిని
యీచాయ నా తలపోఁత లేమందునే చెలియా

(॥ఎంత॥)
పట్టినట్టె వున్నవి పడఁతి చన్నులు చేత
అట్టె నాతో మాఁటలాడినట్టున్నది
ముట్టినట్టున్నది తన మొనగోర నా చెక్కులు
ఇట్టట్టని చెప్పరాదు యేమందునే చెలియా

(॥ఎంత॥)
కూడినట్టె వున్నది కొమ్మను కాఁగిటిలోన
తోడఁ బండినట్టున్నది దొరకి నాకు
వేడుకైనట్టున్నది శ్రీవేంకటేశుఁడ నేను
యీడ నిన్నీ నిజమాయ నేమందునే చెలియా

(||pallavi||)
ĕṁta nannu valabiṁchĕ nidivo nā prāṇeśhvari
viṁta viṁta suddu livi viṁṭivā vo sĕliyā

(||ĕṁta||)
sūsinaṭṭĕ vunnadi sudadi sakkani rūbu
yesi navvinaṭṭunnadi yĕduḍa nādo
kūsunnayaṭṭĕ vunnadi gŏbbuna nāsaṁgaḍini
yīsāya nā talabom̐ta lemaṁdune sĕliyā

(||ĕṁta||)
paṭṭinaṭṭĕ vunnavi paḍam̐ti sannulu seda
aṭṭĕ nādo mām̐ṭalāḍinaṭṭunnadi
muṭṭinaṭṭunnadi tana mŏnagora nā sĕkkulu
iṭṭaṭṭani sĕpparādu yemaṁdune sĕliyā

(||ĕṁta||)
kūḍinaṭṭĕ vunnadi kŏmmanu kām̐giḍilona
toḍam̐ baṁḍinaṭṭunnadi dŏragi nāgu
veḍugainaṭṭunnadi śhrīveṁkaḍeśhum̐ḍa nenu
yīḍa ninnī nijamāya nemaṁdune sĕliyā