Emta mannimchidivo yeegenu neevu

ఎంత మన్నించితివో యీకెను నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత మన్నించితివో యీకెను నీవు
వింతలెల్లా నీ ముందర వెదచల్లీ నిపుడు

(॥ఎంత॥)
వనిత నీపైఁ జూపీ వాడికలు
వినవయ్యా విన్నపాలు వేడికలు
అనిశముఁ జెలులతో నాడికలు
వెనక చూడవయ్యా వేనలి వీడికలు

(॥ఎంత॥)
వెలఁది పయ్యెదకొంగు విసరులు
కులుకు నవ్వులలోని కొసరులు
కలికి సిగ్గులలోని కసరులు
తెలుసుకోవయ్యా తరితీపుల యసరులు

(॥ఎంత॥)
సుదతి నీపైఁ జల్లిన సొలపులు
అదన నిన్నుఁ గూడిన యలపులు
వదలని కాఁగిళ్ల వలపులు
యిదె శ్రీవేంకటేశ మీయిచ్చయ్యా గెలుపులు

(||pallavi||)
ĕṁta manniṁchidivo yīgĕnu nīvu
viṁtalĕllā nī muṁdara vĕdasallī nibuḍu

(||ĕṁta||)
vanida nībaim̐ jūbī vāḍigalu
vinavayyā vinnabālu veḍigalu
aniśhamum̐ jĕlulado nāḍigalu
vĕnaga sūḍavayyā venali vīḍigalu

(||ĕṁta||)
vĕlam̐di payyĕdagŏṁgu visarulu
kulugu navvulaloni kŏsarulu
kaligi siggulaloni kasarulu
tĕlusugovayyā taridībula yasarulu

(||ĕṁta||)
sudadi nībaim̐ jallina sŏlabulu
adana ninnum̐ gūḍina yalabulu
vadalani kām̐giḽla valabulu
yidĕ śhrīveṁkaḍeśha mīyichchayyā gĕlubulu