ఎంత మందెమేళమని యెంచవద్దు నన్నును
(॥పల్లవి॥)
ఎంత మందెమేళమని యెంచవద్దు నన్నును
పంతమున నుండితేను బయలుపరతును
(॥ఎంత॥)
మచ్చము పైఁబెట్టుకొని మౌనముతో నుండనేల
కొచ్చి పిడిచితే తలగుట్టుకొందురా
ముచ్చట నింతాఁ దిరిగి మొకము సుక్కించుకొంటే
పచ్చిగాఁ గఁ(గం?)బముమాటు బయలు పరతును
(॥ఎంత॥)
కపటాలు పైవేసుక కడఁ జేఇ చాఁచనేల
చపలుఁడవై కోపము సారె నేఁటికి
వుపములు వెదకేవు వొద్దనుండే ఇట్టయితే
అపుడే నీముచ్చిమి బయలుపరపుదును
(॥ఎంత॥)
ఇన్నియు బోధించి వచ్చి ఇట్టె సిగ్గువడనేల
వన్నెల మొక్కితే రాయివలె నుండేవు
నన్ను శ్రీ వేంకటేశుఁడ ననుపునఁ గూడితివి
పన్నిన నీ గుట్టెల్లా బయలుపరతును
(||pallavi||)
ĕṁta maṁdĕmeḽamani yĕṁchavaddu nannunu
paṁtamuna nuṁḍidenu bayalubaradunu
(||ĕṁta||)
machchamu paim̐bĕṭṭugŏni maunamudo nuṁḍanela
kŏchchi piḍiside talaguṭṭugŏṁdurā
muchchaḍa niṁtām̐ dirigi mŏgamu sukkiṁchugŏṁṭe
pachchigām̐ gam̐(gaṁ?)bamumāḍu bayalu paradunu
(||ĕṁta||)
kabaḍālu paivesuga kaḍam̐ jei sām̐sanela
sabalum̐ḍavai kobamu sārĕ nem̐ṭigi
vubamulu vĕdagevu vŏddanuṁḍe iṭṭayide
abuḍe nīmuchchimi bayalubarabudunu
(||ĕṁta||)
inniyu bodhiṁchi vachchi iṭṭĕ sigguvaḍanela
vannĕla mŏkkide rāyivalĕ nuṁḍevu
nannu śhrī veṁkaḍeśhum̐ḍa nanubunam̐ gūḍidivi
pannina nī guṭṭĕllā bayalubaradunu