ఎంత మాయకాఁడవో యేమని చెప్పుదు నిను
(॥పల్లవి॥)
ఎంత మాయకాఁడవో యేమని చెప్పుదు నిను
పొంతల నవ్వేవేల బూమెటవలెను
(॥ఎంత॥)
చెప్పగానే నూరూరీ చిన్ననాటివలపు
కప్పము వట్టినచింత కాయవలెను
దప్పీ నాఁకలీఁ దీరీని తగ నీమోవి చూచితే
విప్పుచును పెక్కిండ్లవిందువలెను
(॥ఎంత॥)
వింటే మేను గరుపారీ వినోదపు నీసుద్దులు
ముంటివాఁడిజాజిననమొగ్గలవలె
చంటికొనలజవ్వనమే జడిసీ నీవద్దనుంటే
పంటవండినరాసులభాగ్యముల వలెను
(॥ఎంత॥)
కూడఁగానే ఆసలెక్కీ కోరిననీరతులను
వాడికెఁ గూడివచ్చినవడ్డివలెను
యీడన శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నీడలనిలిచిననిధానము వలెను
(||pallavi||)
ĕṁta māyagām̐ḍavo yemani sĕppudu ninu
pŏṁtala navvevela būmĕḍavalĕnu
(||ĕṁta||)
sĕppagāne nūrūrī sinnanāḍivalabu
kappamu vaṭṭinasiṁta kāyavalĕnu
dappī nām̐kalīm̐ dīrīni taga nīmovi sūside
vippusunu pĕkkiṁḍlaviṁduvalĕnu
(||ĕṁta||)
viṁṭe menu garubārī vinodabu nīsuddulu
muṁṭivām̐ḍijājinanamŏggalavalĕ
saṁṭigŏnalajavvaname jaḍisī nīvaddanuṁṭe
paṁṭavaṁḍinarāsulabhāgyamula valĕnu
(||ĕṁta||)
kūḍam̐gāne āsalĕkkī korinanīradulanu
vāḍigĕm̐ gūḍivachchinavaḍḍivalĕnu
yīḍana śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nīḍalanilisinanidhānamu valĕnu