ఎంత లేదు నీసుద్దు లేమిచెప్పేది
(॥పల్లవి॥)
ఎంత లేదు నీసుద్దు లేమిచెప్పేది
వింతవానివలెనే నివ్వెరగందేవు
(॥॥)
బలురాణివాసమై లోపలనే వున్నది గాక
చలము సాదించెనా సతి నీతోను
వెలినుండి నీవే వచ్చి వేఁడుకొనఁగా వద్దనెనా
అలరి యీడనుండే యాఱడిఁబెట్టేవు
(॥॥)
యిల్లాలుగనక తా నిలువనుఁన్నది గాక
కల్లరివని కొంకెనా కాంత నీతోను
వొల్లనే నీవు వద్దఁ గూచుండఁగా వద్దనెనా
వుల్లము దెలియ నీవు వొరసి చూచేవు
(॥॥)
యిచ్చ నీదేవులుగన కెదుట జంకించెఁ గాక
మచ్చరమా అలమేలుమంగ నీతోను
కొచ్చి శ్రీ వేంకటేశుఁడ కూడితివి వద్దనెనా
మెచ్చుచు నీలోనే నీవు మేకులఁ బెట్టేవు
(||pallavi||)
ĕṁta ledu nīsuddu lemisĕppedi
viṁtavānivalĕne nivvĕragaṁdevu
(||||)
balurāṇivāsamai lobalane vunnadi gāga
salamu sādiṁchĕnā sadi nīdonu
vĕlinuṁḍi nīve vachchi vem̐ḍugŏnam̐gā vaddanĕnā
alari yīḍanuṁḍe yāṟaḍim̐bĕṭṭevu
(||||)
yillāluganaga tā niluvanum̐nnadi gāga
kallarivani kŏṁkĕnā kāṁta nīdonu
vŏllane nīvu vaddam̐ gūsuṁḍam̐gā vaddanĕnā
vullamu dĕliya nīvu vŏrasi sūsevu
(||||)
yichcha nīdevulugana kĕduḍa jaṁkiṁchĕm̐ gāga
machcharamā alamelumaṁga nīdonu
kŏchchi śhrī veṁkaḍeśhum̐ḍa kūḍidivi vaddanĕnā
mĕchchusu nīlone nīvu megulam̐ bĕṭṭevu