ఎంత కంతే చాలుఁ గాక యెక్కుడేఁటికి
(॥పల్లవి॥)
ఎంత కంతే చాలుఁ గాక యెక్కుడేఁటికి
వంతులకు మమ్మునేల వాసులు రేఁచేవు
(॥ఎంత॥)
మొగము చూచినందుకు మొక్కితేనే చాలదా
నగవు లిందుకుఁదోడు నగవలెనా
అగడుసేసి నీతో నలిగేటి వారమా
వెగటుగా మమ్మేల వింతలు సేసేవు
(॥ఎంత॥)
చేసన్న సేసినందుకు సిగ్గువడుటే చాలదా
ఆసపడి అండకురా నంత వలెనా
వీసమంత పనికిఁగా వేసరించే వారమా
రాసికెక్క మమ్మునేల రాఁపులఁబెట్టేవు
(॥ఎంత॥)
వొడివట్టిన యందుకు వూరకుండుతే చాలదా
సడిఁబెట్టి కాఁగిలించ సారె వలెనా
చిడుముడిఁ గూడితివి శ్రీ వేంకటేశ నన్ను
కడవారమా యేల కతలు సేసేవు
(||pallavi||)
ĕṁta kaṁte sālum̐ gāga yĕkkuḍem̐ṭigi
vaṁtulagu mammunela vāsulu rem̐sevu
(||ĕṁta||)
mŏgamu sūsinaṁdugu mŏkkidene sāladā
nagavu liṁdugum̐doḍu nagavalĕnā
agaḍusesi nīdo naligeḍi vāramā
vĕgaḍugā mammela viṁtalu sesevu
(||ĕṁta||)
sesanna sesinaṁdugu sigguvaḍuḍe sāladā
āsabaḍi aṁḍagurā naṁta valĕnā
vīsamaṁta panigim̐gā vesariṁche vāramā
rāsigĕkka mammunela rām̐pulam̐bĕṭṭevu
(||ĕṁta||)
vŏḍivaṭṭina yaṁdugu vūraguṁḍude sāladā
saḍim̐bĕṭṭi kām̐giliṁcha sārĕ valĕnā
siḍumuḍim̐ gūḍidivi śhrī veṁkaḍeśha nannu
kaḍavāramā yela kadalu sesevu