Emta kakkooridigaamde yee ramanumdu

ఎంత కక్కూరితికాఁడే యీ రమణుఁడు
Language

(॥పల్లవి॥)
ఎంత కక్కూరితికాఁడే యీ రమణుఁడు
వింతైన తన వయసు వేడుకే నెరపీని

(॥ఎంత॥)
చెలప చెమటలు మైఁ జిప్పిలీననఁగానే
అలరి పెనఁగులాడుమనీ నీతఁడు
చలువైన తనమేను సరతయ్యే దెఱఁగడు
వలచినయట్టి కళవళమే చూచీని

(॥ఎంత॥)
యిదివో తేనెలమోవి యెంగిలినో రనఁగానే
అదన మాటాడుమనీ నప్పటిఁ దాను
పదరి అంటుముట్టని పరులాడే దెఱఁగఁడు
కదిసేటితన తమకమే యెంచుకొనీని

(॥ఎంత॥)
రతుల నా చన్నులు గీరకుమీ నీ వనఁగానే
తతిఁ గూడుమనుచుఁ గాఁతాళించీని
మితిమీర ననుఁగూడె మేను వొత్తేది యెంచఁడు
మతి శ్రీవేంకటేశుఁడు మదమే చూపీని

(||pallavi||)
ĕṁta kakkūridigām̐ḍe yī ramaṇum̐ḍu
viṁtaina tana vayasu veḍuge nĕrabīni

(||ĕṁta||)
sĕlaba sĕmaḍalu maim̐ jippilīnanam̐gāne
alari pĕnam̐gulāḍumanī nīdam̐ḍu
saluvaina tanamenu saradayye dĕṟam̐gaḍu
valasinayaṭṭi kaḽavaḽame sūsīni

(||ĕṁta||)
yidivo tenĕlamovi yĕṁgilino ranam̐gāne
adana māḍāḍumanī nappaḍim̐ dānu
padari aṁṭumuṭṭani parulāḍe dĕṟam̐gam̐ḍu
kadiseḍidana tamagame yĕṁchugŏnīni

(||ĕṁta||)
radula nā sannulu gīragumī nī vanam̐gāne
tadim̐ gūḍumanusum̐ gām̐tāḽiṁchīni
midimīra nanum̐gūḍĕ menu vŏttedi yĕṁcham̐ḍu
madi śhrīveṁkaḍeśhum̐ḍu madame sūbīni